Godavari Pushkaralu 2027 | ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా గోదావరి పుష్కరాలు
Godavari Pushkaralu 2027 | గోదావరి పుష్కరాలు–2027ను తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవం ప్రతిబింబించేలా నిర్వహిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశ విదేశాల నుంచి ఎనిమిది కోట్ల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నామని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
- ఎనిమిది కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా
- ఘాట్లు, ఆలయాలు, భక్తుల సౌకర్యాలకు రూ.1,115 కోట్లతో అభివృద్ధి పనులు
- లోగో, నినాదం రూపకల్పనలో ప్రజలకూ అవకాశం
- నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
Godavari Pushkaralu 2027 | గోదావరి పుష్కరాలు–2027ను తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవం ప్రతిబింబించేలా నిర్వహిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశ విదేశాల నుంచి ఎనిమిది కోట్ల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నామని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. పుష్కరాల సందర్భంగా శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో సోమవారం గోదావరి పుష్కరాల లోగో, నినాదం రూపకల్పనపై నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే పుష్కరాల కోసం ఘాట్లు, ఆలయాల అభివృద్ధి, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాల కల్పనకు రూ.1,115 కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందిన గోదావరి నదీ తీరంలోని బాసర, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలకు పుష్కరాల సమయంలో భారీగా భక్తులు తరలివస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయా ఆలయాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు వివరించారు. బాసర ఆలయ అభివృద్ధికి రూ.324 కోట్లు, భద్రాచలానికి రూ.276 కోట్లు, కాళేశ్వరానికి రూ.198 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
లోగో, నినాదం రూపకల్పనకు పోటీలు
గోదావరి పుష్కరాల ఆధ్యాత్మిక విశిష్టత, నది పవిత్రత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేలా లోగో, నినాదం ఉండాలని మంత్రి సూచించారు. ఈ రూపకల్పనలో విద్యార్థులు, కళాకారులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆసక్తి ఉన్నవారు వ్యక్తిగతంగా లేదా గరిష్ఠంగా ముగ్గురు సభ్యులతో కూడిన బృందంగా పోటీలో పాల్గొనవచ్చన్నారు. లోగో, నినాదాన్ని కలిపి ఒకే ఎంట్రీగా నవంబర్ 30లోగా సమర్పించాలని సూచించారు. సృజనాత్మకత, ప్రత్యేకత, పుష్కరాల స్ఫూర్తికి అనుగుణంగా ఉండటం, వివిధ ప్రచార మాధ్యమాల్లో వినియోగించుకునే అవకాశం వంటి అంశాల ఆధారంగా రాష్ట్రస్థాయి కమిటీ విజేతలను ఎంపిక చేయనుంది. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా రూ.లక్ష, రూ.50 వేలు, రూ.25 వేల నగదు బహుమతులు అందజేయనున్నారు. తొలి 100 ఎంట్రీలకు ప్రశంసాపత్రాలు ఇవ్వనున్నారు.
పుష్కరాల విశిష్టతను చాటాలి : పొన్నం
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాల ప్రత్యేకతను కళాత్మకంగా ఆవిష్కరించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CM Revanth Reddy | హరీశ్ మంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Gold Exchange | పాత బంగారం మార్చుకుంటే లక్షల రూపాయల పన్ను భారం.. ఇలా తప్పించుకోవచ్చు..
- ●Ramchandar Rao | మోదీ ఎన్నిక చెల్లనప్పుడు.. రేవంత్ ఎన్నిక కూడా చెల్లదు
- ●CM Revanth Reddy | 2022లోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు అనుమతిచ్చారు
- ●బంజారాల ఆత్మగౌరవానికి ప్రతీకగా సేవాలాల్ ఆలయం
- ●Anthropic IPO | ఆంథ్రోపిక్ షేర్లలో భారీ పతనం.. ఇప్పుడు కొనొచ్చా?

CM Revanth Reddy | హరీశ్ మంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు : సీఎం రేవంత్ రెడ్డి

Gold Exchange | పాత బంగారం మార్చుకుంటే లక్షల రూపాయల పన్ను భారం.. ఇలా తప్పించుకోవచ్చు..

Ramchandar Rao | మోదీ ఎన్నిక చెల్లనప్పుడు.. రేవంత్ ఎన్నిక కూడా చెల్లదు

CM Revanth Reddy | 2022లోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు అనుమతిచ్చారు





