త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | ఖేలో ఇండియా గేమ్స్.. గిరిజ‌న బిడ్డ‌ల‌కు అవ‌మాన‌మే

RS Praveen Kumar | తెలంగాణ‌లో త్వ‌ర‌లో నిర్వ‌హించ‌బోయే ఖేలో ఇండియా గేమ్స్‌లో కయాకింగ్, కెనోయింగ్ వాటర్ స్పోర్ట్స్ లేకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతుందని విద్యార్థులు కలిసి కన్నీటి పర్యంతమయ్యారు అని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తెలిపారు.

S

Telangana | Published On Oct 17, 2026, 3.47 pm IST

RS Praveen Kumar | ఖేలో ఇండియా గేమ్స్.. గిరిజ‌న బిడ్డ‌ల‌కు అవ‌మాన‌మే
Advertisement

ఖైలో ఇండియా గేమ్స్‌లో క‌యాకింగ్, కెనోయింగ్ వాట‌ర్ స్పోర్ట్స్ ఎక్క‌డ‌..?
సీఎంతో పాటు క్రీడ‌ల శాఖ మంత్రి స్పందించాలి
బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ డిమాండ్

RS Praveen Kumar | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ‌లో త్వ‌ర‌లో నిర్వ‌హించ‌బోయే ఖేలో ఇండియా గేమ్స్‌లో కయాకింగ్, కెనోయింగ్ వాటర్ స్పోర్ట్స్ లేకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతుందని విద్యార్థులు కలిసి కన్నీటి పర్యంతమయ్యారు అని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తెలిపారు. ఇది ఖచ్చితంగా ఖేలో ఇండియా గేమ్స్‌లో గిరిజన బిడ్డలకు అవమానమే అని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఆ ఆశను చంపేయటం దారుణం

వీరంతా తెలంగాణ ప్రభుత్వం చేత, ఉచితంగా వసతి సౌకర్యం పొందుతూ, హుస్సేన్ సాగర్‌లో ఎన్నో ఏళ్లుగా ట్రైనింగ్ తీసుకుంటూ, చాలా మంది విద్యార్థులు అనేక స్పోర్ట్స్ మీట్స్‌లో గిరిజ‌న ఆశ్ర‌మ పాఠ‌శాల విద్యార్థులు పాల్గొని పథకాలు కూడా సాధించారు. ఈ సారి సొంత రాష్ట్రంలో జరిగే ఖేలో ఇండియా గేమ్స్ పోటీల్లో, ఎలాగైనా బంగారు పథకం గెలువాలన్న ఆశతో శిక్షణ పొందుతున్నారు. కానీ ప్రభుత్వమే ఆ ఆశను చంపేయటం దారుణం అని ఆర్ఎస్పీ మండిప‌డ్డారు.

వివక్ష చూపుతున్నారు

ఒక పక్క రేవంత్ రెడ్డేమో స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటున్నారు, తెలంగాణను క్రీడా కేంద్రంగా తయారు చేస్తామంటున్నారు, క్రీడల్లో రాణిస్తే ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహాలు ఇస్తామని ప్రకటిస్తున్నారు. మరో పక్క అత్యంత ప్రతిభావంతులైన, పలుమార్లు అవార్డులు పొందిన పేద గిరిజన విద్యార్థులను కనీసం పోటీల్లో కూడా పాల్గొనకుండా వివక్ష చూపుతున్నారు అని ధ్వ‌జ‌మెత్తారు.

ఇంకెంత కాలం అవకాశాల కోసం వేచిచూడాలి?

కయాకింగ్, కెనోయింగ్ ఒలంపిక్ స్పోర్ట్, గతంలో క‌శ్మీర్‌లో జరిగిన ఖేలో ఇండియా గేమ్స్‌లో కూడా ఈ స్పోర్ట్ ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఖేలో ఇండియా జాబితా నుండి ఈ స్పోర్ట్‌ను లేకుండా చేస్తుంది. గిరిజన సంక్షేమ మంత్రి, క్రీడా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి ఈ పేద గిరిజన విద్యార్థుల ప్రతిభను కనబరిచే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకెంత కాలం ఈ పేద బిడ్డలు అవకాశాల కోసం వేచిచూడాలి? అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిల‌దీశారు.

Advertisement
Advertisement