త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FCI Hockey Tournament | రేప‌ట్నుంచి ఎఫ్‌సీఐ అంత‌ర్ జోన‌ల్ హాకీ టోర్న‌మెంట్

FCI Hockey Tournament | భారత ఆహార సంస్థ ( FCI ), తెలంగాణ ప్రాంతం ఆధ్వర్యంలో 55వ అఖిల భారత అంతర్‌జోనల్ హాకీ టోర్నమెంట్( Hockey Tournament ) ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వ‌హించ‌నున్నారు.

S

Telangana | Published On Nov 15, 2026, 3.54 pm IST

FCI Hockey Tournament | రేప‌ట్నుంచి ఎఫ్‌సీఐ అంత‌ర్ జోన‌ల్ హాకీ టోర్న‌మెంట్
Advertisement

FCI Hockey Tournament | త్రినేత్ర న్యూస్ : భారత ఆహార సంస్థ ( FCI ), తెలంగాణ ప్రాంతం ఆధ్వర్యంలో 55వ అఖిల భారత అంతర్‌జోనల్ హాకీ టోర్నమెంట్( Hockey Tournament ) ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వ‌హించ‌నున్నారు.

ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నవంబర్ 16న ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం, దక్షిణ మధ్య రైల్వే హాకీ గ్రౌండ్స్‌లో జరగనుంది. భారత ఆహార సంస్థ దక్షిణ జోన్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ సింగ్ టోర్నమెంట్‌ను ప్రారంభించనున్నారు.

నవంబర్ 16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. ఎఫ్‌సీఐ ఉద్యోగులు తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ టోర్నమెంట్ ఒక వేదికగా నిలవనుంది.

ఈ సందర్భంగా ఎఫ్‌సీఐ తెలంగాణ ప్రాంత జనరల్ మేనేజర్ అనుజ్ త్యాగి మాట్లాడుతూ.. ఎఫ్‌సీఐ ఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం, వారిలో స్నేహభావం, ఐక్యత, జట్టుగా పనిచేసే తత్వాన్ని బలోపేతం చేయడం ఈ టోర్నమెంట్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. తెలంగాణలో ఈ జాతీయ స్థాయి క్రీడా వేడుకను నిర్వహించే అవకాశం కల్పించిన ఎఫ్‌సీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, అలాగే దక్షిణ జోన్ కార్యనిర్వాహక డైరెక్టర్, చెన్నై వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు త్యాగి తెలిపారు.

ఎఫ్‌సీఐ ఉన్నతాధికారులు, వివిధ జోన్లకు చెందిన క్రీడాకారులు, అధికారులు పాల్గొనే ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విస్తృత ప్రచారం కల్పించాలని జనరల్ మేనేజర్ ఈ సందర్భంగా కోరారు.

Advertisement
Advertisement