త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | రాహుల్ గాంధీ ఏ దేశానికి చెందిన వ్య‌క్తి..?

Bandi Sanjay | రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ వేదిక‌గా నిర్వ‌హించిన భార‌త్ స‌మ్మిట్‌లో రాహుల్ గాంధీ వ్య‌వ‌హ‌రించిన తీరు చూస్తుంటే ఆయ‌న ఏ దేశానికి చెందిన వ్యక్తి అని‌.. అనుమానించే పరిస్థితి మన దేశానికి ఏర్పడింది అని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ పేర్కొన్నారు.

S

Telangana | Published On Nov 15, 2026, 3.46 pm IST

Bandi Sanjay | రాహుల్ గాంధీ ఏ దేశానికి చెందిన వ్య‌క్తి..?
Advertisement

ఆయ‌న నేష‌నాలిటీపై అనుమానం ఏర్ప‌డింది
భార‌త్ స‌మ్మిట్‌పై దేశ వ్య‌తిరేక శ‌క్తులే ఉన్నారు
కాంగ్రెస్ స‌ర్కార్‌పై బండి సంజ‌య్ ఆగ్ర‌హం

Bandi Sanjay | త్రినేత్ర న్యూస్ : రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ వేదిక‌గా నిర్వ‌హించిన భార‌త్ స‌మ్మిట్‌లో రాహుల్ గాంధీ వ్య‌వ‌హ‌రించిన తీరు చూస్తుంటే ఆయ‌న ఏ దేశానికి చెందిన వ్యక్తి అని‌.. అనుమానించే పరిస్థితి మన దేశానికి ఏర్పడింది అని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ పేర్కొన్నారు. భార‌త్ స‌మ్మిట్‌పై బండి సంజ‌య్ స్పందిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

హైద‌రాబాద్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన భార‌త్ స‌మ్మిట్ అట్ట‌ర్ ప్లాఫ్ అయింది. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ‌మైన‌ది. రాహుల్ గాందీ ఆలోచ‌న కూడా దుర్మార్గం. దేశంలో రాజ్యాంగానికి అనుగుణంగా ప్ర‌జాస్వామ్యం వెల్లివిరుస్తుంది అని బండి సంజ‌య్ పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ..హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకుని రేవంత్ రెడ్డిని ముందు పెట్టి, భారత దేశ వ్యతిరేక శక్తులను ఏకం చేసి, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, దేశంలో ప్రజాస్వామ్యం కూనీ అయిందని, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచే విధంగా, ప్రపంచం ముందు భారతదేశం తలదించుకునే విధంగా రాహుల్ గాంధీ వ్యవహరించడం మూర్ఖత్వం అని మండిప‌డ్డారు.

రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ముందుపెట్టి ప్ర‌పంచంలోని భార‌త‌దేశ వ్య‌తిరేక శ‌క్తుల‌ను పిలిపించి భార‌త్ స‌మ్మిట్ వేదిక‌గా దేశానికి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేయ‌డం ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేయ‌డ‌మే. ఒక‌వైపు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ భార‌త‌దేశ కీర్తిని ప్ర‌పంచ ప‌తాక స్థాయికి తీసుకుపోతే, ప్ర‌తి భార‌తీయుడు గ‌ల్లా ఎగ‌రేసే ప‌రిస్థితి తీసుకువ‌స్తే.. దానికి భిన్నంగా రాహుల్ గాంధీ ఓర్వ‌లేని త‌నంతో దేశాన్ని కించ‌ప‌రిచే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌మ్మిట్‌కు వ‌చ్చిన వారంతా ఈ దేశాన్ని వ్య‌తిరేకించిన వారే. ఈ దేశ ప్ర‌జ‌ల‌ను అవ‌మాన ప‌రిచే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో రాహుల్ గాంధీ ఏ దేశానికి చెందిన వ్యక్తి అని‌.. అనుమానించే పరిస్థితి మన దేశానికి ఏర్పడింది అని బండి సంజ‌య్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement