Ponnam Prabhakar | ఉనికిని చాటుకునేందుకే రాహుల్‌పై విమర్శలు.. బీజేపీ, కేటీఆర్‌పై మంత్రి పొన్నం ఆగ్రహం
Ponnam Prabhakar | తమ ఉనికిని చాటుకోవడానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) కొంతమంది విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మండిపడ్డారు. రాహుల్ హైదరాబాద్ పర్యటనపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్: తమ ఉనికి చాటుకోవడానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) కొంతమంది విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మండిపడ్డారు. రాహుల్ హైదరాబాద్ పర్యటనపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), బీజేపీ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదన్నారు. దేశంలో అందరూ ప్రేమ పూర్వక భావన ఉండాలనుకునే మనస్తత్వం గల నాయకుడు రాహుల్ గాంధీ అని చెప్పారు. సామాజిక న్యాయం జరగాలని కోరుకునే నాయకుడన్నారు.
‘రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అంత ఇమేజ్ కేటీఆర్‌కు లేదు. ఆ కుటుంబం మొత్తం త్యాగం చేసిన కుటుంబం. నేరెళ్ల దళితుల దాడి మీ సారథ్యం కాదా? ఖమ్మంలో రైతులకు బేడీలు మీ పాలనలో కాదా? మల్లన్న సాగర్ బాధితుల మీద లాఠీఛార్జ్ మీ పాలనలో కాదా? పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చారా? మేము ఇచ్చాం.. నిర్వహించి చూపించాం. మాకు హామీలు ఇవ్వడమే కాదు అమలు చేసే సత్తా కూడా ఉంది. మీలాగ వేల కోట్ల రూపాయల ఆస్తుల సంపాదన మీద ఆసక్తి లేదు.. అవసరం లేదు.. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నాం. అవినీతి గురించి మీరు మాట్లాడటం అంటే వింతగా ఉంది. ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుందని మీరు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోలు, అసైన్‌ల్యాండ్‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే మీ అవినీతిలెక్కలు చెప్పడానికి ఒక ఏడాది పడుతుంది. మీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్భాటాలు.. మా ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న ఏర్పాట్లు.. బేరీజు వేస్తే అబద్ధం కూడా సిగ్గు పడుతుంది’ అంటూ కేటీఆర్‌పై మండిపడ్డారు.
బీజేపీ వాళ్లు బయపడుతున్నరు..
బీజేపీ (BJP) వారిది రాహుల్ గాంధీ రేంజ్ కాదని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారని చెప్పారు. దేశాన్ని ఐక్యంగా ఉంచుతున్నందుకే రాహుల్‌కి బయపడుతున్నారని వెల్లడించారు. రాజ్యాంగాన్ని కాపాడడంలో, ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో.. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ వెంట తెలంగాణ ఉంటుందన్నారు. ఆయన ప్రతి మాటను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. తాము రాసే ప్రతి పుస్తకంలో సోనియా గాంధీ పేరు ఉంటుందన్నారు. తెలంగాణ ఇచ్చింది ముమ్మాటికీ సోనియా గాంధీయే అన్నారు.
సంబంధిత వార్తలు

DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం
నవంబర్ 15, 2026

Bharat Summit Hyderabad Visa Row | అప్పుడు రేవంత్ టూర్.. ఇప్పుడు హైదరాబాద్ ‘భారత్ సమ్మిట్’! మళ్లీ తెరపైకి వీసా వివాదం
నవంబర్ 14, 2026

Road Accident | డివైడర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవర్ బయటికొచ్చేలోపే ఏం జరిగిందంటే!
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం
- ●Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!
- ●Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం
- ●Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!
- ●Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్
- ●Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!

DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం

Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!

Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం

Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!



