KPHB Open Plots Auction | కేపీహెచ్బీలో హాట్ కేకుల్లా ఓపెన్ ప్లాట్లు.. గజం ఏకంగా రూ.2.70 లక్షలు
కేపీహెచ్‌బీ హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలంలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. గజం స్థలం ఏకంగా రూ.2.70 లక్షలు పలకడంతో హౌసింగ్ బోర్డుకు కాసుల వర్షం కురిసింది.
- కూకట్పల్లి (KPHB) ఫేజ్-7లో 16 ఎంఐజీ ఓపెన్ ప్లాట్లకు బుధవారం జరిగిన వేలంలో రికార్డు ధరలు
- అత్యధికంగా ఒక చదరపు గజం భూమి ధర రూ. 2.70 లక్షలు పలికిన వైనం
- ఈ ఓపెన్ ఆక్షన్ ద్వారా హౌసింగ్ బోర్డుకు సుమారు రూ. 47.14 కోట్ల భారీ ఆదాయం
- కనీస ధర గజానికి రూ. 1.60 లక్షలు కాగా, సగటున రూ. 1.79 లక్షల ధర లభించిందని తెలిపిన వైస్ ఛైర్మన్ వీపీ గౌతం
KPHB Open Plots Auction | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ (Real Estate) మార్కెట్లో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) భూములకు ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది. ఎటువంటి వివాదాలు లేని, అన్ని మౌలిక వసతులున్న కేపీహెచ్‌బీ ఫేజ్-7లోని 16 ఎంఐజీ (MIG) ఓపెన్ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో రికార్డు స్థాయి ధరలు పలికాయి.
పోటీపడ్డ బిడ్డర్లు.. రికార్డు బ్రేక్ చేసిన ధరలు
ఆగస్టు 10న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం జరిగిన ఈ వేలంలో (Auction).. తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకోవడానికి మొత్తం 19 మంది బిడ్డర్లు (Bidders) తీవ్రంగా పోటీపడ్డారు. హౌసింగ్ బోర్డు గజం కనీస ధర రూ. 1.60 లక్షలుగా నిర్ణయించగా, అత్యధికంగా ఒక ప్లాట్ గజానికి రూ. 2.70 లక్షల చొప్పున అమ్ముడుపోయి సరికొత్త రికార్డు సృష్టించింది. మరో ప్లాట్‌ను ఒకరు గజం రూ. 2.36 లక్షలకు కొనుగోలు చేయగా, ఇంకో రెండు ప్లాట్లను రూ. 2.06 లక్షలకు బిడ్డర్లు సొంతం చేసుకున్నారు.
బోర్డుకు కాసుల వర్షం
పూర్తి పారదర్శకంగా సాగిన ఈ ఆక్షన్‌లో సగటున చదరపు గజం ధర సుమారు రూ. 1.79 లక్షలు పలికిందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి. గౌతం వెల్లడించారు. ప్లాట్లకు భారీ డిమాండ్ ఏర్పడటంతో, ఈ ఒక్క వేలం ద్వారానే హౌసింగ్ బోర్డుకు ఏకంగా రూ. 47.14 కోట్ల భారీ ఆదాయం సమకూరిందని ఆయన వివరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం





