Komatireddy Venkat Reddy | సీఎంను ఏకవచనంతో సంబోధించడమా..? మనం ఏ యుగంలో ఉన్నాం..?
Komatireddy Venkat Reddy | శాసనసభలో బీజేపీ, బీఆర్ఎస్ వైఖరి పట్ల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏక వచనంతో సంబోధించడం సరైంది కాదు.. స్పీకర్‌ను బీఆర్ఎస్ అవమానిస్తే రెస్క్యూ కోసం వచ్చాం అని మాట్లాడుతున్నారు. ఈ రెండు పదాలు వారు విత్ డ్రా చేసుకోవాలి అని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
- శాసనసభలో బీఆర్ఎస్, బీజేపీపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
Komatireddy Venkat Reddy | త్రినేత్ర.న్యూస్ : శాసనసభలో బీజేపీ, బీఆర్ఎస్ వైఖరి పట్ల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏక వచనంతో సంబోధించడం సరైంది కాదు.. స్పీకర్‌ను బీఆర్ఎస్ అవమానిస్తే రెస్క్యూ కోసం వచ్చాం అని మాట్లాడుతున్నారు. ఈ రెండు పదాలు వారు విత్ డ్రా చేసుకోవాలి అని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
సభ ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఈరోజు వరకు బీజేపీ, బీఆర్ఎస్ ఏకైక లక్ష్యం సభను అడ్డుకోవడంగానే కనిపిస్తోంది. స్పీకర్ స్థానాన్ని అవమానించడం, చెప్పరాని మాటలు మాట్లాడటం సభ్య సమాజం తలదించుకునే విషయం. స్పీకర్ తల్లి గురించి కూడా మాట్లాడి సభలో అనవసరమైన గొడవకు కారణమయ్యారు. దళిత స్పీకర్‌ను బీఆర్ఎస్ అవమానిస్తే, దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గే కూర్చున్న వేదికను బిజెపి శుద్ధి చేయడం దారుణం? మనం ఏ యుగంలో ఉన్నాం? దళిత నాయకులను అవమానించే స్థాయికి రాజకీయాలు దిగజారడం బాధాకరం అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు ఆ పార్టీని కూడా తిరస్కరిస్తారు
ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు. ఐదు దశాబ్దాలుగా ప్రజల మధ్య ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన సీనియర్ నాయకుడు. అలాంటి నాయకుడిని అవమానించడం ప్రజాస్వామ్యానికే అవమానం. రాహుల్ గాంధీ ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తే ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం మరింత దురదృష్టకరం. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నట్లు కనిపించినా, సభను అడ్డుకోవడంలో మాత్రం ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయి. బీఆర్‌ఎస్ చేసిన తప్పులనే బీజేపీ కూడా చేస్తే, ప్రజలు ఆ పార్టీని కూడా తిరస్కరిస్తారు అని హెచ్చరించారు.
బిల్లులపై చర్చ జరిగేలా చూడాలి
ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంది. సభ్యులు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చిస్తామని లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. సభా సమయాన్ని వృథా చేయకుండా ప్రజలకు ఉపయోగపడే బిల్లులపై చర్చ జరగాలి. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ తీసుకొచ్చిన బిల్లు గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధిగా మార్చే మంచి కార్యక్రమం. గ్రామాల్లో వసూలయ్యే పన్నుల ఆదాయాన్ని నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి తీసుకెళ్లి, అదే నిధులతో గ్రామాల అభివృద్ధికి ఉపయోగించే విధానం చాలా మంచి ఆలోచన. మహేశ్వర్ రెడ్డి, బీజేపీ సభ్యులు ఇప్పటికైనా సభా కార్యక్రమాలకు సహకరించి, అభివృద్ధికి సంబంధించిన బిల్లులపై చర్చ జరిగేలా చూడాలి. ప్రజలు ఎన్నుకున్న శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలి కానీ, సభను అడ్డుకోవడం ద్వారా ప్రజల సమయాన్ని, సభా సమయాన్ని వృథా చేయకూడదు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు.
తాజావార్తలు
- ●Ranabaali | సింగనమల బొబ్బిలి రణబాలిరా నీ అక్క..! విజయ్ పవర్ఫుల్ డైలాగ్‌తో రణబాలి టీజర్..!
- ●E20 Petrol | కేంద్రం తీసుకొచ్చిన ఇథనాల్ పెట్రోల్‌కు పొన్నం ప్రభాకర్ మద్దతు.. అదంతా అపోహే అన్న మంత్రి
- ●Harish Rao | ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదు.. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ విధించిన సస్పెన్షన్
- ●Balmoor Venkat | పోలీసు నియామకాల్లో లాంగ్ జంప్ 4 మీటర్ల నుంచి 3.8 మీటర్లకు తగ్గించాలి
- ●Fauzi Movie | ‘ఫౌజీ’కి బ్రేక్.. సంక్రాంతి రేసులో నిలిచే ఛాన్స్..!
- ●Supreme Court | బీసీసీఐని జాతీయ క్రీడా చట్టం పరిధిలోకి ఎందుకు తీసుకురాకూడదు..? : సుప్రీంకోర్టు

Ranabaali | సింగనమల బొబ్బిలి రణబాలిరా నీ అక్క..! విజయ్ పవర్ఫుల్ డైలాగ్‌తో రణబాలి టీజర్..!

E20 Petrol | కేంద్రం తీసుకొచ్చిన ఇథనాల్ పెట్రోల్‌కు పొన్నం ప్రభాకర్ మద్దతు.. అదంతా అపోహే అన్న మంత్రి

Harish Rao | ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదు.. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ విధించిన సస్పెన్షన్

Balmoor Venkat | పోలీసు నియామకాల్లో లాంగ్ జంప్ 4 మీటర్ల నుంచి 3.8 మీటర్లకు తగ్గించాలి





