త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ranabaali | సింగ‌న‌మ‌ల బొబ్బిలి ర‌ణ‌బాలిరా నీ అక్క‌..! విజ‌య్‌ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌తో ర‌ణ‌బాలి టీజ‌ర్‌..!

Ranabaali | విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా ‘రణబాలి’. కింగ్‌డమ్‌ తర్వాత విజయ్‌ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. శ్యామ్‌ సింగ రాయ్‌ ఫేమ్‌ రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. తాజాగా మేకర్స్‌ విడుదల చేసిన టీజర్‌ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

P

Entertainment | Published On Sep 9, 2026, 5.04 pm IST

Ranabaali | సింగ‌న‌మ‌ల బొబ్బిలి ర‌ణ‌బాలిరా నీ అక్క‌..! విజ‌య్‌ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌తో ర‌ణ‌బాలి టీజ‌ర్‌..!
Advertisement

Ranabaali | విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా ‘రణబాలి’. కింగ్‌డమ్‌ తర్వాత విజయ్‌ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. శ్యామ్‌ సింగ రాయ్‌ ఫేమ్‌ రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. తాజాగా మేకర్స్‌ విడుదల చేసిన టీజర్‌ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. 19వ శతాబ్దపు నేపథ్యం, బ్రిటిష్‌ పాలకుల దురాగతాలు, రక్తపాతంతో కూడిన పోరాటాలు.. వీటన్నింటినీ టీజర్‌లో పవర్‌ఫుల్‌గా ఆవిష్కరించారు.

బ్రిటిష్‌ అరాచకంపై పోరాటం

1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్‌ పాలనలో జరిగిన చారిత్రక ఘటనల ఆధారంగా ‘రణబాలి’ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో బ్రిటిష్‌ సైనికాధికారుల దురాగతాల కారణంగా ఏర్పడిన ఆహార సంక్షోభాన్ని సినిమాలో ప్రధానంగా చూపించినట్లు టీజర్‌లో చూపించారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీలో భారతీయుల నుంచి ఆహార ధాన్యాలను బ్రిటిష్‌ పాలకులు దోచుకోవడం.. అమాయక ప్రజలను నిర్దాక్షిణ్యంగా హతమార్చడం వంటి ఘట్టాలను ఇందులో చూపించనున్న‌ట్లుగా టీజ‌ర్‌ను చూస్తే తెలుస్తోంది. ఈ అరాచకానికి అడ్డుకట్ట వేసేందుకు సింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్‌ దేవరకొండ తిరుగుబాటు చేస్తాడు. బ్రిటిష్‌ పాలకుల ఆధిపత్యాన్ని సవాల్‌ చేస్తూ.. వారికి కొరకరాని కొయ్యగా మారే యోధుడి పాత్రలో విజయ్‌ కనిపించనున్నాడు. టీజర్‌లో ఆయన పాత్రను తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటోంది.

యోధుడిగా విజయ్‌ విశ్వరూపం

రణబాలి పాత్ర కోసం విజయ్‌ దేవరకొండ లుక్‌, బాడీ లాంగ్వేజ్‌లోనూ పూర్తిగా మారింది. కళ్లలో కోపం.. ముఖంలో కసి.. శత్రువును ఎదుర్కొనే తెగువతో ఆయన పాత్రను పవర్‌ఫుల్‌గా చూపించారు. సింగ‌న‌మ‌ల బొబ్బిలిరా నీ అక్క‌.. అంటూ చెప్పిన డైలాగ్‌, భారీ యాక్షన్‌ సన్నివేశాలు, రక్తపాతం, యుద్ధ ఘట్టాలు టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా విజయ్‌ యోధుడిగా కనిపించిన తీరు సినిమాపై అంచనాలను పెంచుతోంది. కేవలం యాక్షన్‌ మాత్రమే కాకుండా.. అప్పటి సామాజిక పరిస్థితులు, ప్రజల కష్టాలు, బ్రిటిష్‌ పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఓ వ్యక్తి ఎలా తిరుగుబాటు చేశాడనే అంశాన్ని దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది.

అదిరిపోయేలా..

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్‌ సమర్పిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో నిర్మాణ విలువలు తెరపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. అజయ్‌–అతుల్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ యాక్షన్‌ సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చింది. టీజర్‌లోని విజువల్స్‌, యాక్షన్‌ కొరియోగ్రఫీ, సంగీతం కలసి సినిమాను భారీ స్కేల్‌లో నిలబెట్టాయి. ఇప్పటికే ‘కింగ్‌డమ్‌’తో నిరాశపరిచిన విజయ్‌ దేవరకొండ.. ‘రణబాలి’తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. టీజర్‌ చూస్తుంటే విజయ్‌ మరోసారి తనదైన యాక్షన్‌ అవతార్‌లో మెప్పించేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Advertisement