Madhavi Latha | తెలంగాణపై విషం చిమ్మిన మాధవీలత.. ఆజాద్ కశ్మీరీలలా ప్రవర్తిస్తున్నారంటూ కామెంట్స్
Madhavi Latha | గుంటూరు వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవీలత తెలంగాణపై తన అక్కసును వెల్లగక్కారు. ఆజాద్ కశ్మీర్ వాళ్లు ప్రత్యేక దేశం కోరుకున్నట్లే తెలంగాణ ప్రజలు కూడా అలాగే కోరుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
Madhavi Latha | త్రినేత్ర.న్యూస్: గుంటూరు వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవీలత తెలంగాణపై తన అక్కసును వెల్లగక్కారు. ఆజాద్ కశ్మీరీలలా ప్రవర్తిస్తున్నారంటూ విషం చిమ్మే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ పేరుతో ఆజాద్ కశ్మీర్ కాన్సెప్ట్‌లోనే బతుకుతున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు. ఆజాద్ కశ్మీర్ వాళ్లు ప్రత్యేక దేశం కోరుకున్నట్లే తెలంగాణ ప్రజలు కూడా అలాగే కోరుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. తెలంగాణపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. పని చేసుకోవడానికి వచ్చిన వాళ్లని తెలంగాణ ప్రజలు ఏం అనలేదని, ఇప్పటికీ ఇక్కడ పనిచేసే వాళ్లు ఆంధ్రానుంచి ఉన్నారని కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణ ప్రజల సంస్కృతిని, భాష, యాసను ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించేలా మాట్లాడితేనే ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడమని మరొకరు తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. మర్యాదగా ఉంటే తాము ఏమనమని.. మా మీద పెత్తనం చేస్తేనే ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మంటామని మరో నెటిజన్ కామెంట్ పెట్టగా మరికొందరు ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
తెలంగాణపై విషం చిమ్మిన బీజేపీ నాయకురాలు మాధవీలత 🤮
తెలంగాణ పేరుతో తెలంగాణ ప్రజలు అజాద్ కాశ్మీర్ కాన్సెప్ట్ లో బతుకుతున్నారు
ఆజాద్ కాశ్మీర్ ప్రత్యేక దేశం కోరుకున్నట్టు తెలంగాణ వారు అదే విధంగా కూడా ప్రవర్తిస్తున్నారు అనీ తెలంగాణపై తన అక్కసు… pic.twitter.com/N8tL9fHuRD
— TRPartyOfficial (@TRPartyOfficial) June 11, 2026
సంబంధిత వార్తలు

Ramchandar Rao | ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నరు.. మనం కూడా సిద్ధం కావాలే
జూన్ 11, 2026

Jupally Krishna Rao | గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం.. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు : మంత్రి జూపల్లి
జూన్ 11, 2026

Harish Rao | 5 వేల పోస్టులకు కాదు.. 19 వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలి.. హరీశ్‌రావు డిమాండ్
జూన్ 11, 2026
తాజావార్తలు
- ●Ramchandar Rao | ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నరు.. మనం కూడా సిద్ధం కావాలే
- ●SEBI | ఓయో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. మరో 4 కంపెనీలకూ అనుమతి..
- ●Indian Mangoes | భారతీయ మామిడి పండ్లపై నేపాల్ నిషేధం..? కేంద్రం క్లారిటీ
- ●Indian Sailors | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారత నావికులు మృతి
- ●Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్లలో రైళ్లు రద్దు
- ●Jupally Krishna Rao | గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం.. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు : మంత్రి జూపల్లి

Ramchandar Rao | ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నరు.. మనం కూడా సిద్ధం కావాలే

SEBI | ఓయో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. మరో 4 కంపెనీలకూ అనుమతి..

Indian Mangoes | భారతీయ మామిడి పండ్లపై నేపాల్ నిషేధం..? కేంద్రం క్లారిటీ

Indian Sailors | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారత నావికులు మృతి



