త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Parent Care Bill | తెలంగాణ ఉద్యోగుల జ‌వాబుదారీత‌నం, పర్యవేక్షణ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి అడ్లూరి

Telangana Parent Care Bill | త్రినేత్ర‌.న్యూస్‌: వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ, యోగక్షేమాల కోసం ఉద్దేశించిన‌ ‘తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు-2026’ను (Telangana Parent Care Bill) ప్రభుత్వం శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టింది.

G

Telangana | Published On Mar 28, 2026, 10.26 am IST

Telangana Parent Care Bill | తెలంగాణ ఉద్యోగుల జ‌వాబుదారీత‌నం, పర్యవేక్షణ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి అడ్లూరి
Advertisement

Telangana Parent Care Bill | త్రినేత్ర‌.న్యూస్‌: వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ, యోగక్షేమాల కోసం ఉద్దేశించిన‌ ‘తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు-2026’ను (Telangana Parent Care Bill) ప్రభుత్వం శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టింది. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు పొందుతున్న ఉద్యోగులు ఒకవేళ వారి త‌ల్లిదండ్రుల‌ను పట్టించుకోకుంటే వారి జీతం నుంచి 15 శాతం కోత విధించి.. తల్లిదండ్రుల అకౌంట్‌లో జమ చేయ‌డానికి ఉద్దేశించిన ఈ బిల్లును మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ స‌భ‌లో ప్ర‌తిపాదించారు. ఈ బిల్లు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేయకుడా ప్రైవేటుసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం తల్లిదండ్రులను పట్టించుకోకుంటే తమ వేతనంలో నెలకు 15 శాతం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్ర‌భుత్వం జమ చేయనుంది.

జిల్లాల్లో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులకు (జిల్లా కలెక్టరు) కారణాలు వివరిస్తూ దరఖాస్తు చేసుకుంటే ఆ అధికారి పరిశీలించి దరఖాస్తును పరిష్కరిస్తారు. తరువాత ఉద్యోగి వేతనం నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు భృతిగా అధికారి నిర్ణయిస్తారు.

బిల్లు ప్రకారం.. ఎలాంటి ఆధారం లేని తల్లిదండ్రులు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దానిని పరిశీలించి 60 రోజుట్లోగా సమస్యను అధికారులు పరిష్కరిస్తారు. తరువాత ఉద్యోగి జీతం నుంచి నిర్దేశించిన మొత్తాన్ని మినహాయించి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఆదేశాలివ్వాల్సి ఉంటుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement