త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adluri Laxman Kumar | విదేశీ విద్య‌కు రూ. 607.49 కోట్లు చెల్లించాం : మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్

Adluri Laxman Kumar | ప్ర‌జాపాల‌న‌లో విదేశీ విద్య‌కు రూ. 607.49 కోట్లు చెల్లించిన‌ట్లు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా విదేశీ విద్య ప‌థ‌కానికి నిధులు కేటాయించ‌క‌పోవ‌డంతో విద్యార్థులు ఫీజులు క‌ట్ట‌లేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స‌భ దృష్టికి తీసుకువ‌చ్చారు.

S

Telangana | Published On Mar 24, 2026, 1.02 pm IST

Adluri Laxman Kumar | విదేశీ విద్య‌కు రూ. 607.49 కోట్లు చెల్లించాం : మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్
Advertisement

Adluri Laxman Kumar | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌జాపాల‌న‌లో విదేశీ విద్య‌కు రూ. 607.49 కోట్లు చెల్లించిన‌ట్లు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా విదేశీ విద్య ప‌థ‌కానికి నిధులు కేటాయించ‌క‌పోవ‌డంతో విద్యార్థులు ఫీజులు క‌ట్ట‌లేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స‌భ దృష్టికి తీసుకువ‌చ్చారు.

దీంతో మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ మాట్లాడుతూ.. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఓవ‌ర్సీస్ స్కాల‌ర్‌షిప్ ప‌థ‌కాన్ని ఉమ్మ‌డి ఏపీలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం 2013లో ప్రారంభించింది. ఈ ప‌థ‌కాన్ని గ‌త ప్ర‌భుత్వం కొన‌సాగించింది.. మేం కూడా కొన‌సాగిస్తున్నాం. ఈ ప‌థ‌కం కింద ఒక్కో విద్యార్థికి రూ. 20 ల‌క్ష‌ల వ‌ర‌కు స్కాల‌ర్‌షిప్ ఇస్తున్నాం. 2023-24 విద్యా సంవ‌త్స‌రంలో రూ. 126 కోట్లు, 2024-25లో రూ. 144 కోట్లు, 2025-26లో రూ. 326 కోట్లు విడుద‌ల చేశాం. మొత్తంగా రూ. 607.49 కోట్లు చెల్లించాం. ఇంకా రూ. 53 కోట్లు బకాయిలు ఉన్నాయి.. ఆ బ‌కాయిల‌ను కూడా సాధ్య‌మైనంత త్వ‌ర‌గా చెల్లిస్తామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

ప్ర‌జాపాల‌న‌లో విదేశీ విద్య ప‌థ‌కం కింద విద్యార్థుల సంఖ్య‌ను పెంచినం. బీఆర్ఎస్ హ‌యాంలో 200 మంది ఎస్సీ విద్యార్థుల‌కు అవ‌కాశం క‌ల్పిస్తే మేం 500 మందికి అవ‌కాశం క‌ల్పించాం. ఎస్టీ విద్యార్థులు 100 మంది నుంచి 200ల‌కు, బీసీ విద్యార్థుల‌ను 285 నుంచి 500ల‌కు, ఈబీసీ విద్యార్థుల‌ను 15 నుంచి 200 మంది వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించాం. మైనార్టీ వ‌ర్గాల్లో 600 మంది దాకా పంపించాం. ఇప్ప‌టి వ‌ర‌కు 2 వేల మంది విద్యార్థుల‌కు విదేశాల్లో ఉన్న‌త విద్య‌కు అవ‌కాశం క‌ల్పించామ‌ని మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement