Minister Adluri | గురుకులాలకు సరుకుల సరఫరాలో జాప్యంపై మంత్రి ఫైర్
Minister Adluri | గురుకుల విద్యార్థులకు నిత్యావసర సరుకులు, విద్యా సామగ్రి, స్టూడెంట్ కిట్ల సరఫరాలో జాప్యంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత గడువులోగా సరుకులన్నీ సరఫరా చేయాలని, లేదంటే టెండర్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- ఈ నెల 16లోగా పెండింగ్ వస్తువులు అందించాలి
- లేదంటే టెండర్ నిబంధనల ప్రకారం చర్యలు
- విద్యార్థుల సంక్షేమంలో నిర్లక్ష్యం సహించేది లేదు
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
Minister Adluri | గురుకుల విద్యార్థులకు నిత్యావసర సరుకులు, విద్యా సామగ్రి, స్టూడెంట్ కిట్ల సరఫరాలో జాప్యంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత గడువులోగా సరుకులన్నీ సరఫరా చేయాలని, లేదంటే టెండర్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం సచివాలయంలో పీఎంయూ ద్వారా గురుకులాలకు జరుగుతున్న సరఫరాలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఆహారం, వసతి, నిత్యావసరాల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.
మఫత్లాల్‌కు డెడ్‌లైన్
ఆగస్టులోనే టెండర్లు ఖరారు చేసి ఆర్డర్లు ఇచ్చినా ఇండెంట్లకు అనుగుణంగా సరుకులు సరఫరా కాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మఫత్లాల్ సంస్థ వద్ద సుమారు 2 వేల జతల రెండో విడత తెల్ల సాక్సులు, 3వేల ట్రంకు పెట్టెలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీటితోపాటు మిగిలిన వస్తువులన్నింటినీ ఈ నెల 16లోగా సరఫరా చేస్తామని సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారు. గడువు దాటితే ఒప్పంద నిబంధనల మేరకు చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. సరఫరా చేస్తున్న ప్రతి వస్తువు నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. వస్తువుల నాణ్యతను ధ్రువీకరిస్తున్న అధికారులు, పాఠశాలల్లో వాటి స్వీకరణ, నిల్వ, పంపిణీ బాధ్యతలు చూస్తున్న వారి వివరాలతో నివేదిక ఇవ్వాలని శాఖాధిపతులకు సూచించారు. ప్రతి జిల్లాకు నోడల్ అధికారిని నియమించి సరఫరా, నిల్వలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. సరుకుల కొరత రాకుండా బఫర్ స్టాక్ తప్పనిసరిగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో గురుకులాలను సందర్శించి ఇండెంట్ల మేరకు సరుకులు అందుతున్నాయో లేదో పరిశీలించాలని ఆదేశించారు. నవంబరు 25లోగా సరఫరా పురోగతిపై సమగ్ర నివేదిక అందించాలని సూచించారు.
విద్యార్థుల సంక్షేమమే ప్రాధాన్యం
గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసరాలు సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. సమస్యలు తలెత్తితే బాధ్యతలను ఒకరిపై మరొకరు నెట్టకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు. విద్యార్థుల ఆహారం, ఆరోగ్యం, విద్య, వసతి విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్షలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి, పీఎంయూ ఛైర్మన్ గుగులోతు రవి, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి బి.ఎల్. సంతోష్, పీఎంయూ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!
నవంబర్ 15, 2026

Karthika Brahmotsavam | అరుణాచల క్షేత్రానికి కార్తీక శోభ.. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
నవంబర్ 15, 2026

Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం
- ●Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!
- ●Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం
- ●Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!
- ●Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్
- ●Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!

DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం

Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!

Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం

Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!



