త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS MLA’s meet | కేటీఆర్ నివాసంలో ఎమ్మెల్యేల భేటీ.. వ‌ట్టినాగుల ప‌ల్లికి వెళ్ల‌నున్న బృందం

BRS MLA's | శాస‌న‌స‌భ స‌మావేశాల నుంచి ఆదివారం సస్పెన్షన్ కు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల (BRS MLA's) బృందం బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ నివాసంలో భేటీ అయింది. ఎమ్మెల్యేల‌తో క‌లిసి కేటీఆర్, హరీశ్‌ రావుతో వట్టినాగులపల్లి (Vattinagulapally)కి బ‌య‌లుదేరారు.

S

Telangana | Published On Mar 30, 2026, 12.15 pm IST

BRS MLA’s meet | కేటీఆర్ నివాసంలో ఎమ్మెల్యేల భేటీ.. వ‌ట్టినాగుల ప‌ల్లికి వెళ్ల‌నున్న బృందం
Advertisement

త్రినేత్ర.న్యూస్‌: శాస‌న‌స‌భ స‌మావేశాల నుంచి ఆదివారం సస్పెన్షన్ కు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల (BRS MLA's) బృందం బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ నివాసంలో భేటీ అయింది. స్పీక‌ర్ నిన్న‌ స‌స్పెన్ష‌న్ చేసిన నేపథ్యంలో కేటీఆర్ నివాసంలో ఎమ్మెల్యేలతో కేటీఆర్, హరీశ్‌రావు ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ నివాసం వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు. వంద‌ల సంఖ్య‌లో పోలీసులు బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యేల‌తో క‌లిసి కేటీఆర్, హరీశ్‌ రావుతో వట్టినాగులపల్లి (Vattinagulapally)కి బ‌య‌లుదేరారు.

మంత్రి పొంగులేటి కుమారుడి భూకబ్జా బాధితులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క‌లిసి వారి నుంచి వివ‌రాల‌ను అడిగి తెలుసుకోనున్నారు. దాంతోపాటు కబ్జాకు గురైన భూములను పరిశీలించి బాధితులకు భ‌రోసా ఇవ్వ‌నున్నారు. భూములు కోల్పోయి బాధ‌లో ఉన్న బాధితుల‌కు గులాబీ నేతలు అండ‌గా నిల‌వ‌నున్నారు.

రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం వట్టినాగులపల్లిలోని కబ్జాకు గురైన భూములను ఇప్పించాలని కొద్ది రోజులుగా భూ బాధితులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 3వేల మంది యజమానులను ఫ్లాట్ల వద్దకు రానివ్వకుండా... కొందరు ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. 1983లో ఆ భూములను కొనుగోలు చేశామని, అవి దక్కే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని బాధితులు తేల్చిచెబుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement