త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | కాకికి పెడుదామంటే కంకెడు లేవు, పిట్ట‌కు పెడుదామంటే పిడికెడు లేవు : కేసీఆర్

KCR | జ‌గిత్యాల స‌భ‌లో బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ కాంగ్రెస్ (Congress) పై విమ‌ర్శ‌లు గుప్పించారు. పొద‌రిల్లు మాదిరి అప్ప‌జెప్పామ‌ని.. ఈరోజు తెలంగాణ‌ను ఆగం చేశార‌ని మండిపడ్డారు. ఎవ‌రు ఏమ‌న్నా స‌రే.. మ‌ళ్లీ బీఆర్ఎస్ రావాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

S

News | Published On Apr 20, 2026, 9.54 pm IST

KCR | కాకికి పెడుదామంటే కంకెడు లేవు, పిట్ట‌కు పెడుదామంటే పిడికెడు లేవు : కేసీఆర్
Advertisement

KCR: త్రినేత్ర‌.న్యూస్‌: జ‌గిత్యాల స‌భ‌లో బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ కాంగ్రెస్ (Congress) పై విమ‌ర్శ‌లు గుప్పించారు. పొద‌రిల్లు మాదిరి అప్ప‌జెప్పామ‌ని.. ఈరోజు తెలంగాణ‌ను ఆగం చేశార‌ని మండిపడ్డారు. ఎవ‌రు ఏమ‌న్నా స‌రే.. మ‌ళ్లీ బీఆర్ఎస్ రావాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఇది మోసం గోస ప‌డుతాం అని చెప్పిన‌.. ఆర్థిక ప‌రిస్థితి బాలేద‌ని చెప్పాను.. 1.7 శాతంతో ఓడిపోయాం. 10 మంది స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. బీఆర్ఎస్ ఓట‌మి పాలైంది. వ‌చ్చిన ప్ర‌భుత్వం ప‌ని చేయాలి క‌దా.. నేను మాట్లాడ‌లేదు బ‌య‌ట‌కు రాలేదు. ఒక‌ట్రెండు సార్లు వ‌చ్చాను. వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని ప‌రిపాల‌న చేయాల‌ని అనుకున్నాం అని కేసీఆర్ చెప్పారు.

ఇవాళ ఎక్క‌డ చూసినా చిల్ల‌ర మాట‌లు త‌ప్ప నిర్మాణాత్మ‌క‌మైన కార్య‌క్ర‌మాలు లేవు. గొప్పం స్కీం మొద‌లుపెట్టారా? పొద‌రిల్లు మాదిరి అప్ప‌జెప్పాం. నీరు, త‌ల‌స‌రి ఆదాయం, జీఎస్డీపీలో నంబ‌వ‌ర్ వ‌న్. కేంద్ర అవార్డులు వ‌చ్చాయి. రెండున్న‌రేండ్ల‌లో రైతులు ఏడుస్తున్నారు.. క‌రెంటుకు నీళ్ల‌కు బాధ లేకుండా, యూరియా బ‌స్తాలు ఇవ్వ‌డానికి చేత‌కాలేదు.. యాప్ పెట్టారు. ద‌మ్ముంటే దుకాణంలో పెట్టాలి. యాప్‌లు ప‌ట్టుకుని తిరిగితే కాళ్ల‌కు వాపులు వ‌స్తున్నాయి. అంత‌కుముందు కాంగ్రెస్ గ‌వ‌ర్న‌మెంట్‌లో పోలీసు స్టేష‌న్లో పెట్టి అమ్మారు. ఇవాళ మ‌ళ్లీ చెప్పు లైన్‌లు. యూరియా కోసం బాధ అస‌మ‌ర్థ‌మైన ప్ర‌భుత్వం ఇది. బంగారంలా ఉన్న రైతు ఎంత బాగుండే. త‌డిసిన ధాన్యం నుంచి కొని రైతుల‌కు డ‌బ్బులు వేసేది.

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ వ‌ల్ల లాభం జ‌రిగింది. నేను కొన‌సాగించాను. ఇవాళ విద్యార్థులు రోడ్డున ప‌డ్డారు. పిల్ల‌ల ద‌గ్గ‌ర వ‌సూలు చేసుకోవాల‌ని కోర్టులు చెబుతున్నాయి. ఎవ‌ర్నీ క‌దిలించినా విద్యార్థి, రిటైర్డు ఉద్యోగులు, రైతాంగం ప్ర‌తి ఒక్క‌రూ అసంతృప్తి బాధ‌తో ఉన్నారు. అన్యాయం జ‌రిగిందని అంటున్నారు. మేం ఓవ‌ర్సీస్ స్కాల‌ర్‌షిప్‌ల కింద రూ. 20 ల‌క్ష‌లు ఇచ్చాం. నిరుపేద ఓసీల‌కు కూడా ఇచ్చాం. అన్నింటిని స‌ర్వ‌నాశ‌నం చేశారు. స్కాంలు కుంభ‌కోణాలు భూక‌బ్జాలు.. ఈ ర‌కంగా సింగ‌రేణిని నాశ‌నం చేసి బొగ్గు గ‌నుల్లో, సివిల్ స‌ప్ల‌య్‌లో స్కాం.. ప్ర‌జ‌ల‌కు మంచి చేసే ప‌రిస్థితి లేదు. వారి మాట‌లు కోట‌లు దాటాయి. రెండున్న‌రేండ్లు గ‌డిచిపోయింది. కాకికి పెడుదామంటే కంకెడు లేవు. పిట్ట‌కు పెడుదామంటే పిడికెడు లేవు. ఏ రంగంలో కూడా అభివృద్ధి జ‌ర‌గ‌లేదు. ప‌ల్లెల‌ను బాగు చేసుకోవాల‌ని ప‌ల్లె ప్ర‌గ‌తి చేసుకున్నాం. ప్ర‌తి ఊరికి వైకుంఠ‌ధామాలు క‌ట్టినాం. క్రీడా ప్రాంగ‌ణం, న‌ర్స‌రీలు, ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు, ప్ర‌తి జీపీకి ట్రాక్ట‌ర్ ఇప్పించాం. ట్రాక్ట‌ర్లు మూల‌కు ప‌డ్డాయి. ప‌ల్లె వ‌నాల‌కు నీళ్లు పోసే దిక్కు లేదు ఏం రోగం వ‌చ్చింది. ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శిని పిలిచి ఎమ్మెల్యే జీతాలు బంద్ పెట్టి జీపీల‌కు డ‌బ్బులు విడుద‌ల చేసేవాళ్లం.. కార్య‌క్ర‌మాలు జ‌రిగి గ్రామాలు మంచిగా ఉండేవి. మున్సిపాలిటీలు మురికి కూపాలుగా ఉన్నాయి.

ఈ కాంగ్రెస్ సిపాయిలు కేసీఆర్ చ‌క్క‌గా చేస్త‌లేడు అని మాట్లాడారు. ఆరు సంద‌మాలు ఏడు సూర్యులు అని న‌రికారు. ఇవాళ రాష్ట్ర ఆర్థిక ఆదాయం ఎందుకు దిగ‌జారింది. కేసీఆర్ ఉన్ప‌పుడు రియ‌ల్ ఎస్టేట్ రైతుల భూముల ధ‌ర‌లు ఎట్ల ఉండే.. మూడు కోట్ల వ‌ర‌కు ఉండే.. రైతుల‌కు ధీమా ఉండేది. అమ్మాయి పెళ్లికి ఇబ్బంది లేకుండా ఉండే.. ఇవాళ అమ్మేటోడు ఉన్నాడు.. కానీ కొనేటోడు లేడు. రాష్ట్రంలో ఎవ‌ర్నీ ప‌ల‌క‌రించినా ఇదే బాధ‌. రైతుల భూములు ధ‌ర‌లు ఆర్థిక ప‌రిస్థితి ప‌డిపోయింది.

మ‌క్క‌లు కొనే ప‌రిస్థితి లేదు. అధికారుల‌కు కొనొద్ద‌ని చెబుతూ.. పైపై మాట‌ల‌కు కొంట‌మ‌ని చెబుతున్నారు. బోన‌స్ ఇస్తామ‌ని బోగ‌స్ మాట‌లు చెప్పారు. ఈ విధంగా పంట వేసిన నుంచి కొనుగోలు దాకా బీఆర్ఎస్ రైతుల‌కు తోడుగా నిల‌బ‌డింది. రైతుల‌ను ఆదుకున్న‌ది. ఇవాళ రైతాంగమంతా ఆగ‌మాగం, స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. త‌ప్పు చేసుకున్నాం.. పొర‌పాటు అయింద‌ని బాధ‌ప‌డుతున్నారు. ఉద్యోగుల‌కు 72 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చాం. టీఎన్జీవోలును గుర్తించి గౌర‌వించాం. ఇవాళ ఏడు శాతం కూడా ఇవ్వ‌లేదు. ఎంత‌మందిని మోసం చేశారు. రిటైర్డు ఉద్యోగ‌స్తుల‌కు రావాల్సిన బ‌కాయిలు లేవు. ఆటోరిక్షా కార్మికులు మాట్లాడితే ప‌నికిమాలిన ఫ్రీ బ‌స్సు పెట్టి పొట్ట‌కొట్టార‌ని ఏడుస్తున్నారు.

లోన్ తెచ్చుకోండి మాఫీ చేస్తామ‌న్నారు. కానీ మాఫీ లేదు. అడ్డ‌గోలు మాట‌లు చెప్పి ఇష్ట‌మొచ్చిన క‌థ‌లు చెప్పి ఆరాజ్ పాట పాడిండ్రు. అందుకే జీవ‌న్ రెడ్డి లాంటి సీనియ‌ర్ నాయ‌కులు కాంగ్రెస్‌ పోవాలి.. బీఆర్ఎస్ రావాలి.. రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి.. అంటున్న‌రు. ఈ మాట వ‌ట్టిగ‌నే వ‌స్త‌దా.. బాధ్య‌త లేకుండానే వ‌స్త‌దా.. పొద్దునే లేస్తే దోపిడీ.. ఆర్థిక పరిస్థితి నాశ‌నం. ఎవ‌రూ కూడా స‌క్క‌గ లేరు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న ప‌రిస్థితి. క‌చ్చితంగా ఎట్టి ప‌రిస్థితుల్లో ఎవ‌రు ఏమ‌న్నా స‌రే.. బీఆర్ఎస్ రావాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement