త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తం కండి: ఉమ్మ‌డి రంగారెడ్డి ముఖ్య నాయ‌కుల‌కు కేటీఆర్ పిలుపు

KTR | పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో మంచి విజ‌యాలు సాధించామ‌ని, రాబోయే కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో (Corporation Elections)నూ అదే పంథాను అనుస‌రించాల‌ని, ఇందుకు ఇప్ప‌టినుంచే స‌మాయ‌త్తం కావాల‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం వంటి అంశాలపై చర్చించి గులాబీ నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు.

S

News | Published On May 2, 2026, 1.08 pm IST

KTR | కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తం కండి: ఉమ్మ‌డి రంగారెడ్డి ముఖ్య నాయ‌కుల‌కు కేటీఆర్ పిలుపు
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో మంచి విజ‌యాలు సాధించామ‌ని, రాబోయే కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో (Corporation Elections)నూ అదే పంథాను అనుస‌రించాల‌ని, ఇందుకు ఇప్ప‌టినుంచే స‌మాయ‌త్తం కావాల‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (Rangareddy District) పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో హైద‌రాబాద్ నంది నగర్ నివాసంలో ఆయ‌న శ‌నివారం స‌మావేశ‌మ‌య్యారు. జిల్లాలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం వంటి అంశాలపై చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశం సంద‌ర్భంగా పార్టీ నాయ‌కులకు కేటీఆర్ ప‌లు సూచ‌న‌లు చేశారు. దీంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో చేపట్టాల్సిన కార్యాచరణపై ప్ర‌త్యేకంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో (పంచాయతీ, మున్సిపల్) మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలకు ఆయ‌న‌ అభినందనలు తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని కోరారు. సభ్యత్వ నమోదు, కమిటీల నిర్మాణ విష‌యాల్లో ప్ర‌ణాళిక ప్ర‌కారం ముందుకెళ్లాల‌ని సూచించారు. ఈ స‌మావేశంలో మాజీ మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద‌, శంభిపూర్ రాజు, ముఖ్య నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement