KTR | ఇక కాంగ్రెస్‌కు ప్రజలు ఓటేయరు.. మళ్లీ అధికారం వారికి కలే: కేటీఆర్
KTR | రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ (Congress) పాలన చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశమే లేదని, తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనీసం 20 సంవత్సరాల పాటు అధికారంలోకి రావడం కలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అరాచకాలు, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
- రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయింది
- అవినీతి కుంభకోణాలను చూసి మరో 20 ఏళ్లు ఓటు వేయరు
- ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు
- కేంద్రంలో బీజేపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తూనే ఉంది
- నిన్నపెంచిన వెయ్యి రూపాయల గ్యాస్ సిలిండర్ ధర ఇందులో ఒకటి
- దీన్ని నిరసిస్తూ ఎక్కడికక్కడ నిరసనలు చేద్దాం
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ నేతలకు కేటీఆర్ దిశా నిర్దేశం
KTR | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ (Congress) పాలన చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశమే లేదని, తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనీసం 20 సంవత్సరాల పాటు అధికారంలోకి రావడం కలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలను మోసం చేసిందన్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అరాచకాలు, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (United Rangareddy) పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలతో ఆయన సమీక్ష సమావేశాన్ని నంది నగర్ లోని తన నివాసంలో నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపైన దిశా నిర్దేశం చేశారు.
ప్రజల్లో తీవ్ర ఆగ్రహం..
రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయిందని, అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కమీషన్లు, కాసుల కక్కుర్తి కోసమే చూస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో భూములతో పాటు అనేక మైనింగ్ కుంభకోణాలకు కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులే స్వయంగా పాల్పడుతున్న పరిస్థితి ఉందన్నారు. ఈ అరాచకాలు చూసిన తర్వాత ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.
గ్యాస్ ధరలపై నిరసనలు చేయాలి..
ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ విధంగా ఉంటే, మరోవైపు బీజేపీ కేంద్రంలో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదన్నారు. నిన్న వేయి రూపాయలకు పైగా పెంచిన గ్యాస్ సిలిండర్ ధరనే ఇందులో ఒక ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. అడ్డగోలుగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ వస్తున్న బీజేపీ నిర్వాకం వల్ల ప్రజలపై నిత్యావసర సరుకుల భారం పెరిగిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అడ్డగోలు నిర్ణయాలపై బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కడి నాయకులు అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మరోసారి కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్ ధరలను అడ్డగోలుగా పెంచకుండా ఉండడంతోపాటు నిన్న పెంచిన సిలిండర్ ధర పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేయాలని సూచించారు. వెంటనే పెంచిన సిలిండర్ ధరను వెనక్కి తీసుకొని ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి సంబంధించిన పలు అంశాల పైన కేటీఆర్ సుదీర్ఘంగా మాట్లాడారు. త్వరలో జరగనున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, తర్వాత జరిగే కమిటీల నిర్మాణంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. దీంతోపాటు రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చురుకైన పాత్ర పోషించి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేసే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్నారు.
దొంగ ఓట్లు నమోదు కాకుండా చూద్దాం..
యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయకుండా చూడాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఓట్లు తొలగించే ప్రమాదం ఉన్నదని, ప్రజల ఓటు హక్కుకు బాధ్యతగా భరోసాగా నిలవాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్యేలకు, ప్రజా ప్రతినిధులకు, నాయకులకు కేటీఆర్ సూచించారు. దీంతోపాటు త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ఎన్నికలకు సమాయత్తం కావాలన్నారు. పంచాయతీరాజ్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ మంచి విజయాలు నమోదు చేసిన నేపథ్యంలో పార్టీ నేతలకు కేటీఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



