త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medaram | మేడారంలో కూలిన హోర్డింగ్.. ఇద్ద‌రు భ‌క్తులకు గాయాలు

Medaram | సీఎం రేవంత్ రెడ్డి అట్ట‌హాసంగా జాత‌ర‌ను ప్రారంభించి వారం రోజుల గ‌డ‌వ‌క ముందే.. మేడారంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. జాత‌ర ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన ఓ భారీ హోర్డింగ్ కుప్ప‌కూలిపోయింది.

S

Telangana | Published On Jan 23, 2026, 5.11 pm IST

Medaram | మేడారంలో కూలిన హోర్డింగ్.. ఇద్ద‌రు భ‌క్తులకు గాయాలు
Advertisement

Medaram | త్రినేత్ర‌.న్యూస్ : మేడారం మ‌హా జాత‌ర‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ వ‌న దేవ‌త‌ల గ‌ద్దెల‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి.. ఆల‌యాన్ని భ‌క్తుల‌కు అంకితం చేసిన విష‌యం తెలిసిందే.

సీఎం రేవంత్ రెడ్డి అట్ట‌హాసంగా జాత‌ర‌ను ప్రారంభించి వారం రోజుల గ‌డ‌వ‌క ముందే.. మేడారంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. జాత‌ర ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన ఓ భారీ హోర్డింగ్ కుప్ప‌కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు భ‌క్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. జేసీబీ స‌హాయంతో హోర్డింగ్‌ను ప‌క్క‌కు తొల‌గించారు. భ‌క్తులు త‌క్కువ‌గా ఉన్న స‌మ‌యంలో హోర్డింగ్ కూల‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.

https://x.com/i/status/2014649058863050915

Advertisement

తాజావార్తలు

Advertisement