త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sadasivapet| సదాశివపేట ఎన్నిక‌ల్లో పోటీ చేసే కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితా విడుదల

Sadasivapet | సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి విడుద‌ల చేశారు. మొత్తం 26 వార్డులకు గాను, 25 వ వార్డులకు పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను అధికారికంగా వెల్లడించారు.

A

Telangana | Published On Jan 29, 2026, 4.02 pm IST

Sadasivapet| సదాశివపేట ఎన్నిక‌ల్లో పోటీ చేసే కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితా విడుదల
Advertisement

Sadasivapet | సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి విడుద‌ల చేశారు. మొత్తం 26 వార్డులకు గాను, 25 వ వార్డులకు పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఆంజనేయులు, సీడీసీ ఛైర్మన్ రాంరెడ్డి ,సదాశివపేట పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ త‌దిత‌రులు పాల్గొన్నారు. 6వ వార్డు అభ్యర్థి ఎవరనేది పెండింగ్‌లో ఉంది. అభ్యర్థులందరూ తమ తమ వార్డులలో ప్రచారాన్ని వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. స్థానిక సమస్యల పరిష్కారం, పట్టణ అభివృద్ధిని ప్రధాన అజెండాగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల బరిలోకి దిగుతోంది.

వార్డుల వారీగా అభ్యర్థులు :

వార్డు 1: పిల్లోడి విశ్వనాథం
వార్డు 2: ఎరుకల నర్సింహులు
వార్డు 3: రేణుక
వార్డు 4: ఎండీ. మోయిజ్
వార్డు 5: ఖుతేజా ఫాతిమా
వార్డు 7: పాతదొడ్డి అనిత
వార్డు 8: సిహెచ్. రేణుక
వార్డు 9: బి. అరుణ్ కుమార్
వార్డు 10: కండి నర్సింహులు గౌడ్
వార్డు 11: గోపి ప్రియాంక
వార్డు 12: పులిమామిడి మమత
వార్డు 13: పిల్లోడి భవాని
వార్డు 14: రాయపాడు స్వరూప
వార్డు 15: గౌసియా బేగం
వార్డు 16: కొత్తగొల్ల చంద్రశేఖర్
వార్డు 17: ఎండీ. షాజీ
వార్డు 18: ఆకుల నిఖిత
వార్డు 19: పట్లూరి రోజా
వార్డు 20: మునిపల్లి అంజమ్మ
వార్డు 21: ఎండీ. వాజీద్
వార్డు 22: పతనం విజయ లక్ష్మి
వార్డు 23: వానగంటి లక్ష్మి ప్రియ (ముగిటి లక్ష్మి ప్రియ)
వార్డు 24: ఎండీ. కలీమ్
వార్డు 25: కే. శంకర్ గౌడ్
వార్డు 26: కావులే హారిక

Advertisement

తాజావార్తలు

Advertisement