Raids on Drugs | యాదాద్రి జిల్లాలో భారీ ఆపరేషన్.. రూ.54 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
Raids on Drugs | యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుకున్నారు. బీబీనగర్ మండల పరిధిలోని కొండమడుగు వద్ద ఆదివారం సుమారు రూ.54 కోట్ల విలువ చేసే 27 కిలోల మెఫిడ్రిన్, 40 కిలోల అసిటోన్ లిక్విడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. డ్రగ్స్ తయారీ, రవాణాకు పాల్పడుతున్న చేతన్ ముధుకర్, ముజామిల్ హక్, అశోక్ గవాండే, రమణమూర్తి అనే నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
Raids on Drugs | త్రినేత్ర.న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుకున్నారు. బీబీనగర్ మండల పరిధిలోని కొండమడుగు వద్ద ఆదివారం సుమారు రూ.54 కోట్ల విలువ చేసే 27 కిలోల మెఫిడ్రిన్, 40 కిలోల అసిటోన్ లిక్విడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. డ్రగ్స్ తయారీ, రవాణాకు పాల్పడుతున్న చేతన్ ముధుకర్, ముజామిల్ హక్, అశోక్ గవాండే, రమణమూర్తి అనే నలుగురు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. కొండమడుగులోని ‘వేటుకూరి ల్యాబ్స్’లో అక్రమంగా మెఫిడ్రిన్ అనే మాదకద్రవ్యాన్ని తయారు చేస్తున్నారు. దాన్ని మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు తరలిస్తుండగా బీబీనగర్ పోలీసులు, ఎస్‌వోటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడుల్లోరూ.54 కోట్ల విలువైన మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. 40 కిలోల అసిటోన్ లిక్విడ్, ఫార్చ్యూనర్ కారు, రియాక్టర్, సెంట్రిఫ్యూజ్ సహా పలు పరికరాలు సీజ్ చేశారు.
నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని పరారీలో ఉన్న మరో ముగ్గురు ఎండీ అయూబ్, ప్రదీప్ ఠాకూర్, గోపాల్ సిర్పట్‌ల కోసం స్పెషల్ టీమ్స్ గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. యాదాద్రి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఆదేశాలతో ఈ భారీ ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Supreme Court | సీఈసీ నిర్ణయాలపై విచారణకు సుప్రీం అంగీకారం
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. డాలర్ బలపడడంతో ఒత్తిడి..
- ●Dr. Nori Lakshmi Bhaskar | నిమ్స్ బార్బర్ ఇంట్లో నోట్ల కట్టలు.. డాక్టర్ లక్ష్మీభాస్కర్ అవినీతి వ్యవహారంలో కొత్త లింకులు..
- ●Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి
- ●Canara Bank Recruitment | కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు.. తెలంగాణలో 134, ఏపీలో 247 ఖాళీలు
- ●Stock Markets | షేర్ మార్కెట్లలో మళ్లీ భారీ పతనం.. 22,600 దిగువకు నిఫ్టీ..

Supreme Court | సీఈసీ నిర్ణయాలపై విచారణకు సుప్రీం అంగీకారం

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. డాలర్ బలపడడంతో ఒత్తిడి..

Dr. Nori Lakshmi Bhaskar | నిమ్స్ బార్బర్ ఇంట్లో నోట్ల కట్టలు.. డాక్టర్ లక్ష్మీభాస్కర్ అవినీతి వ్యవహారంలో కొత్త లింకులు..

Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి






