Sheep | బీబీనగర్‌లో విషాదం.. రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు మృతి
Sheep | త్రినేత్ర న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ (Bibinagar) మండలం కొండమడుగుమెట్టు వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు (Sheep) మృతిచెందాయి.
Sheep | త్రినేత్ర న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ (Bibinagar) మండలం కొండమడుగుమెట్టు వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు (Sheep) మృతిచెందాయి. జిల్లాలోని జూలూరు అలీనగర్‌కు చెందిన గొర్రెల కాపరులు తమ గొర్రెలను మేపుతూ కొండమడుగుమెట్టు సపంలో సేదతీరుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున గొర్రెలు రైల్వే పట్టాలపైకి వెళ్లాయి. ఈ క్రమంలో అటుగా వచ్చిన రైలు (Train) వాటిని ఢీకొట్టింది. దీంతో సుమారు 80 నుంచి 100 గొర్రెలు మృతిచెందాయని కాపరులు కన్నీరు మున్నీరవుతున్నారు.
కాజీపేట నుంచి నాంపల్లి వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ (Dakshin Express) వాటిని ఢీకొట్టి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గొర్రెలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత వార్తలు

Accident | బైకును ఢీకొట్టిన లారీ.. బాలిక దుర్మరణం.. తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు
ఆగస్టు 15, 2026

Raids on Drugs | యాదాద్రి జిల్లాలో భారీ ఆపరేషన్.. రూ.54 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
ఆగస్టు 9, 2026

Tellam Venkat Rao | డీసీఎంను ఢీకొట్టిన కారు.. భద్రాచలం ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●Indian Roller | పాలపిట్టను బంధిస్తే మూడేండ్ల జైలు.. దసరా వేళ ప్రదర్శిస్తే కఠిన చర్యలు..
- ●Smriti Irani | రాజ్యసభకు మళ్లీ వరుణ్ గాంధీ, స్మృతి ఇరానీ..!
- ●Hyderabad Theatre | 22 నిమిషాలు ఆలస్యంగా సినిమా ప్రారంభం.. థియేటర్‌కు రూ. 75 వేలు జరిమానా
- ●TOSS | అక్టోబర్ 11 నుంచి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్
- ●Murder | నలుగురు పిల్లల తల్లికి వేధింపులు.. పుట్టింటికి పిలిచి చున్నీతో ఉరేసిన వివాహిత
- ●KTR | కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్..!

Indian Roller | పాలపిట్టను బంధిస్తే మూడేండ్ల జైలు.. దసరా వేళ ప్రదర్శిస్తే కఠిన చర్యలు..

Smriti Irani | రాజ్యసభకు మళ్లీ వరుణ్ గాంధీ, స్మృతి ఇరానీ..!

Hyderabad Theatre | 22 నిమిషాలు ఆలస్యంగా సినిమా ప్రారంభం.. థియేటర్‌కు రూ. 75 వేలు జరిమానా

TOSS | అక్టోబర్ 11 నుంచి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్



