త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assembly Session | అసెంబ్లీలో మార్ష‌ల్స్ ఓవ‌రాక్ష‌న్‌.. హ‌రీశ్ రావు తోసివేత

Assembly Session | రాఘ‌వ క‌న్‌స్ట్రక్ష‌న్స్ అక్ర‌మాల వ్య‌వ‌హారం రెండో రోజూ అసెంబ్లీని (Assembly Session) కుదిపేస్తున్నది. మంత్రి పొంగులేటిని బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని, రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌పై హౌస్‌క‌మిటీ వేయాల‌ని బీఆర్ఎస్ డిమాండ్ ప‌ట్టుబ‌ట్టింది.

G

Telangana | Published On Mar 29, 2026, 11.41 am IST

Assembly Session | అసెంబ్లీలో మార్ష‌ల్స్ ఓవ‌రాక్ష‌న్‌.. హ‌రీశ్ రావు తోసివేత
Advertisement

Assembly Session | త్రినేత్ర‌.న్యూస్‌: రాఘ‌వ క‌న్‌స్ట్రక్ష‌న్స్ అక్ర‌మాల వ్య‌వ‌హారం రెండో రోజూ అసెంబ్లీని (Assembly Session) కుదిపేస్తున్నది. మంత్రి పొంగులేటిని బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని, రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌పై హౌస్‌క‌మిటీ వేయాల‌ని బీఆర్ఎస్ డిమాండ్ ప‌ట్టుబ‌ట్టింది. స్పీక‌ర్ పోడియం వ‌ద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో మార్ష‌ల్స్ ఓవ‌రాక్ష‌న్ (Assembly Marshals) చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హరీశ్ రావును (Harish Rao) స్పీకర్‌ వెల్‌ దగ్గర మార్షల్స్‌ తోసివేశారు.

స్పీకర్ వెల్‌లోకి వెళ్తున్న హ‌రీశ్ రావును తోసి వేయడంతో ఘర్షణ వాతావణం నెలకొంది. మార్షల్స్ తీరుపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హౌస్ వైపు వెళ్లే ద్వారం వద్ద, అసెంబ్లీ ఇన్నర్ లాబీలో మార్షల్స్‌ను భారీగా మోహరించారు. మరోవైపు శాసన సభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే ఎలాంటి చర్చ జరగకుండానే పంచాయతీ రాజ్‌ బిల్లును ఆమోందించ‌డంపోటు, పేరంట‌ల్ బిల్లుపై చ‌ర్చ‌ను చేప‌ట్టారు.

Advertisement

తాజావార్తలు

Advertisement