త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర

KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో ఓ ముగ్గురు యువ‌కులు పాద‌యాత్ర చేశారు. పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌ని నుంచి పాద‌యాత్ర చేస్తూ ఆదివారం ఎర్ర‌వెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు ఆ ముగ్గురు యువ‌కులు.

S

Telangana | Published On Oct 4, 2026, 6.30 pm IST

KCR | కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర
Advertisement

KCR | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో ఓ ముగ్గురు యువ‌కులు పాద‌యాత్ర చేశారు. పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌ని నుంచి పాద‌యాత్ర చేస్తూ ఆదివారం ఎర్ర‌వెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు ఆ ముగ్గురు యువ‌కులు.

మంథని నుండి పాదయాత్ర చేసి ఎర్ర‌వెల్లికి చేరుకున్న మంథ‌ని బెన్నిపాల్, బూర్ల వెంక‌టేశ్, కొండ వెంక‌టేశ్‌ను కేసీఆర్ అభినందించి, కాసేపు ముచ్చటించారు. తనపట్ల వారు చూపించిన అభిమానానికి శుభాకాంక్ష‌లు తెలిపారు.

కాగా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవ్వడమే గాక, పూర్తి విరుద్ధంగా పనిచేస్తున్నదనే విషయాన్ని ప్రజలు గ్రహించారని, తమ పాదయాత్ర సందర్భంగా ప్రజలతో వారి అనుభవాలను కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. కేసీఆర్ పాలనలో తాము అనుభవించిన పాలనా ఫలితాలను రాష్ట్ర ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని, కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయి తాము ఏమి కోల్పోయామో అర్థం చేసుకున్నారని వారు తెలిపారు. మంథనితో పాటు, రాష్ట్ర ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌నే తిరిగి ముఖ్యమంత్రిగా నిలబెట్టుకోవడం ఖాయమని పాదయాత్ర చేసిన యువకులు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement