Mamitha Baiju | “ప్రేమలు” హీరోయిన్‌కు జాక్‌పాట్ – నాని సినిమాతో రేట్ పెంచేసిన మమితా బైజు!
విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లెహం కుడుంబ యూనిట్ విజయాల తర్వాత తెలుగులో మమితా బైజు బంపరాఫర్ అందుకుంది. నాచురల్ స్టార్ నానితో రొమాన్స్ చేయబోతుంది. ఈ సినిమా కోసం కెరీర్‌లోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్‌ను మమితా బైజు స్వీకరించబోతున్నట్లు సమాచారం.
Entertainment | Published On Oct 4, 2026, 5.54 pm IST
Mamitha Baiju | మలయాళం ముద్దుగుమ్మ మమితా బైజు దక్షిణాదిలో లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ కేరళ సుందరి హీరోయిన్‌గా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లెహం కుడుంబ యూనిట్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. థియేటర్లలో మూడు వందల కోట్లకుపైగా వసూళ్లను సాధించాయి. ఈ విజయాలతో అమ్మడి అదృష్టం మారిపోయింది. పలువురు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా మమితా బైజు పేరు వినిపిస్తోంది. ఈ సూపర్ హిట్ సినిమాల్లో అల్లరి మనస్తత్వం కలిగిన అమ్మాయిగా హుషారైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా టాలీవుడ్‌లో బంపరాఫర్ అందుకున్నట్లు సమాచారం. నాచురల్ స్టార్ నానితో రొమాన్స్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్...
ప్యారడైజ్ బ్లాక్‌బస్టర్ తర్వాత డైరెక్టర్ వెంకీ అట్లూరితో నాని ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్‌పైకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెంకీ అట్లూరి సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా మమితాబైజు కనిపించబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమా కోసం అమ్మడికి భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం.
హయ్యెస్ట్ రెమ్యూనరేషన్...
ప్రస్తుతం ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడు కోట్ల మధ్య పారితోషికం తీసుకుంటోంది మమితాబైజు. విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లెహం కుడుంబ యూనిట్ విజయాలతో అమ్మడి క్రేజ్ పెరిగింది. అందుకు తగ్గట్లే తన రెమ్యూనరేషన్ డబుల్ చేసినట్లు సమాచారం. నాని సినిమా కోసం ఆరు కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. ఈ మలయాళీ బ్యూటీకి ప్రస్తుతం ఉన్న స్టార్‌డమ్, ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆమె కోరినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మేకర్స్ అంగీకరించినట్లు సమాచారం. నాని సినిమాతోనే కెరీర్‌లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్‌ను మమితా బైజు అందుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం తమిళంలో ఇరండవానంతో పాటు ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా మారి తెరకెక్కిస్తోన్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది మమితా బైజు. మలయాళంలో హలో డియర్ సినిమాలు చేస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్
అక్టోబర్ 3, 2026

Nushrratt Bharuccha | విహారయాత్రలో విషాదం – తీవ్రంగా గాయపడిన ఛత్రపతి హీరోయిన్
అక్టోబర్ 2, 2026

Kajal Aggarwal | 30 కోట్లతో తీస్తే కోటి కలెక్షన్లు వచ్చాయి – ఓటీటీలో తెలుగులో రిలీజైన కాజల్ బాలీవుడ్ మూవీ
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●Delhi AAP Protest | ఢిల్లీలో ఆప్ రణరంగం: సీఈసీకి వ్యతిరేకంగా భగ్గుమన్న కార్యకర్తలు
- ●Uttam Kumar Reddy | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ నుంచి నీటి సరఫరా
- ●Samula Ram Reddy | బార్ కౌన్సిల్ చైర్మన్ సాముల రాంరెడ్డికి సన్మానం
- ●KCR | కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర
- ●S Jaishankar Munich Security Conference | అంతర్జాతీయ వేదికపై ఒంటరిగా మారుతున్న అమెరికా
- ●CM Vijay | మహిళల గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోం.. స్టాలిన్‌కు విజయ్ హెచ్చరిక

Delhi AAP Protest | ఢిల్లీలో ఆప్ రణరంగం: సీఈసీకి వ్యతిరేకంగా భగ్గుమన్న కార్యకర్తలు

Uttam Kumar Reddy | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ నుంచి నీటి సరఫరా

Samula Ram Reddy | బార్ కౌన్సిల్ చైర్మన్ సాముల రాంరెడ్డికి సన్మానం

KCR | కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర



