Manne Krishank | కొండల్‌రెడ్డికి మెమరీ లాస్ ఉందట.. బ్యాంక్ లోన్ ఎగ్గొట్టడానికి ఓ హాస్పిటల్ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది
Manne Krishank | బ్యాంక్ లోన్ కట్టనందుకు అనుముల కొండల్‌రెడ్డి (Kondal Reddy) ఇంటికి నోటీసులు ఇచ్చారని.. దాన్ని ఎగ్గొట్టేందుకు మెమరీ లాస్ ఉన్నట్లు ఓ హాస్పిటల్ సర్టిఫికెట్ దారుణమని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ (Manne Krishank) విమర్శించారు.
- ఈన వైమానిక రక్షణ శాఖ చైర్మనంట
- ఇసొంటోనికి రూ.200 కోట్ల భూమి కట్టబెట్టిర్రు
- లోన్ కట్టలేదని కొండల్ రెడ్డి ఇంటికి బ్యాంకోళ్లు నోటీసులు ఇచ్చారు
- బ్యాంక్ లోన్ ఎగ్గొట్టేందుకు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నరు
- మీడియా సమావేశంలో మన్నె క్రిశాంక్ తీవ్ర ఆరోపణలు
Manne Krishank | త్రినేత్ర న్యూస్: బ్యాంక్ లోన్ కట్టనందుకు అనుముల కొండల్‌రెడ్డి (Kondal Reddy) ఇంటికి నోటీసులు ఇచ్చారని.. దాన్ని ఎగ్గొట్టేందుకు మెమరీ లాస్ ఉన్నట్లు ఓ హాస్పిటల్ సర్టిఫికెట్ దారుణమని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ (Manne Krishank) విమర్శించారు. మెమరీ లాస్ ఉన్నోన్ని రక్షణ శాఖకు ఎలా చైర్మన్ చేశారని ప్రశ్నించారు. పైగా రూ.200 కోట్ల భూమి కట్టబెట్టారని ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
అనుముల కొండల్‌రెడ్డికి ఇంటికి నోటీస్ పెట్టిర్రు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2023లో నోటీస్ పంపింది. గచ్చిబౌలి, శేరిలింగంపల్లిల ఒక అసెట్‌ని పెట్టి ఒక 300 గజాల జాగకు సంబంధించి 2 కోట్ల 89 లక్షల అప్పు తీసుకున్నవ్.. వాపస్ ఎప్పుడిస్తవ్ అని నోటీస్ ఇచ్చింది. బ్యాంకు రుణం కట్టడానికి లేవు.. కానీ ఇవాళ 50 వేల కోట్ల ఆస్తులు ఎట్ల నిర్మాణం చేస్తరు. వైమానిక రక్షణ శాఖ చైర్మన్ ఎట్ల అయిపోతవ్? 200 కోట్ల జాగ రేవంత్ ప్రభుత్వం ఎట్లిస్తది.
ఇంకా దారుణం ఏందంటే.. ఇది 2025 కోర్టు డాక్యుమెంట్. కొండల్‌రెడ్డి ఇన్‌కం ట్యాక్స్ ఎగ్గొట్టి కొన్ని సంవత్సరాలు దాటివేసిండు. ఇన్‌కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ కేసు వేస్తే.. తప్పించుకోవడానికి కొండల్‌రెడ్డికి మెమరీ లాస్ ఉందని ఓ హాస్పిటల్ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. అది కోర్టులో చూపెట్టి ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టే ప్రయత్నం చేసిండు. ఈ మెమరీ లాస్ ఉన్నోనికి రూ.200 కోట్ల భూమి కట్టబెట్టారు. వీడు వైమానిక రక్షణ శాఖ చైర్మనంట. ఆస్పత్రులను అడ్డం పెట్టుకొని, వ్యాపారాలు చేసుకుంటూ కోర్టులను పిచ్చోళ్లను చేస్తున్నరు.
అమిత్ షా ఏం సాధించిండు?
అమిత్ షా ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి సాధించింది ఏముంది? ర్యాలీ చేసిర్రు, ఏవో నినాదాలు ఇచ్చిర్రు. అవినీతి మీద దృష్టి పెట్టడం లేదు. కొండల్‌రెడ్డి సిబిల్ స్కోర్ బయట పెట్టాలి. ఫారిన్ నుంచి ఏదో కొత్త కారు బుక్ చేసుకుర్రంట. దానికి బ్యాంకు క్లియరెన్స్ ఇయ్యలేదంట. ఇన్ని లొసుగులున్నయ్.. లోన్ ఇవ్వమని బ్యాంకు వాళ్లు చెప్పిరంట.. దాన్ని మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నరట. బాలరాజుయాదవ్ ప్రెస్‌మీట్ పెట్టినందుకు నిన్న జైలుకు పంపూ ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఏ కార్పొరేషన్‌లోనైనా ఖజానాలు ఖాళీ అయితున్నయ్. ప్రజలకు ఏం ఇస్తలేరు.
ఆర్ఆర్ కార్పొరేషన్ పేరిట రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అన్యాయంగా దందాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూతురు స్కూల్ కోసం, ఆర్ఆర్ మాల్ కోసం నార్సింగిలో 100 ఫీట్ రోడ్ అలైన్‌మెంట్ మార్చి స్కూళ్లు, ఇండ్లు కూలగొడుతున్నారు అని క్రిషాంక్ ఆరోపించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Medical PG Seats | మెడికల్ కాలేజీల్లో పెరిగిన పీజీ సీట్లు..
నవంబర్ 7, 2026

SIR | ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతయ్యాయా? ఓటర్లకు ఈసీ మరో ఛాన్స్..!
నవంబర్ 6, 2026

Gadwal Vijaya Laxmi | ఫీజులు తీసుకుని సర్టిఫికెట్లు ఆపేస్తారా?.. నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్‌పై విజయలక్ష్మి ఆగ్రహం
నవంబర్ 6, 2026
తాజావార్తలు
- ●Tamil Nadu | దీపావళికి ముందు చికెన్ ప్రియులకు షాక్.. అంతుచిక్కని వ్యాధితో 50వేల కోళ్లు మృతి..
- ●FDA | పండుగ వేళ ఎఫ్‌డీఏ కొరడా.. బ్లింకిట్, జెప్టో లైసెన్సులు రద్దు.. డీమార్ట్‌పై చర్యలు
- ●Rytu Bharosa to all | అటు కరువు సాయం..ఇటు రైతు భరోసా..హకీంపేట సభలో సీఎం అనౌన్సమెంట్?
- ●Gold And Silver Prices Today | దీపావళి ముందు బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు.. స్వల్పంగా పెరిగిన ధరలు..
- ●CP Sajjanar | దీపావళి కానుక పేరుతో సైబర్ కేటుగాళ్ల వల.. నకిలీ మెసేజ్‌లతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- ●Rahul Gandhi | ఈ 20 కాస్త 420గా మారింది.. కేంద్రంపై రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం

Tamil Nadu | దీపావళికి ముందు చికెన్ ప్రియులకు షాక్.. అంతుచిక్కని వ్యాధితో 50వేల కోళ్లు మృతి..

FDA | పండుగ వేళ ఎఫ్‌డీఏ కొరడా.. బ్లింకిట్, జెప్టో లైసెన్సులు రద్దు.. డీమార్ట్‌పై చర్యలు

Rytu Bharosa to all | అటు కరువు సాయం..ఇటు రైతు భరోసా..హకీంపేట సభలో సీఎం అనౌన్సమెంట్?

Gold And Silver Prices Today | దీపావళి ముందు బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు.. స్వల్పంగా పెరిగిన ధరలు..



