Manne Krishank | నాకు చట్టపరంగా బెయిల్ వస్తే.. తెలుగు 360 వెట్‌సైట్‌కి ఎందుకంత బాధ: మన్నె క్రిశాంక్
Manne Krishank | కాంగ్రెస్ ప్రభుత్వానికి, పాలకుల అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న తనకు ఓ కేసులో చట్టపరంగా బెయిల్ వస్తే.. తెలుగు 360 (Telugu360) అనే వెబ్‌సైట్‌కు ఎందుకంత బాధ అంటూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ (Manne Krishank) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Manne Krishank | త్రినేత్ర న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వానికి, పాలకుల అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న తనకు ఓ కేసులో చట్టపరంగా బెయిల్ వస్తే.. తెలుగు 360 (Telugu360) అనే వెబ్‌సైట్‌కు ఎందుకంత బాధ అంటూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ (Manne Krishank) ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కఠినమైన సెక్షన్లు వేయాలని రాయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఒక సామాన్యుడు రాజకీయంలో ఎదుగొద్దా? అని నిలదీశారు. సొంత పార్టీలోనే చిచ్చు పెట్టే విధంగా రిపోర్టింగ్ చేయడం ఎంతవరకు సబబుని మండిపడ్డారు.
`నిత్యం కేటీఆర్‌పై (KTR) వ్యక్తిగత అజెండాతో విమర్శలు చేస్తూ, తమ సొంత అబూతకల్పనలనే జర్నలిజంగా రిపోర్టింగ్ చేస్తున్న తెలుగు 360 వారు రాసిన రెండు ఆర్టికల్స్ నాకు ఎవరో పంపించారు. వాస్తవానికి ఆ సంస్థ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను నేను ఎప్పుడో బ్లాక్ చేశాను. వారికి సంబంధించిన ఎవరన్నా రిపోర్టర్ మిత్రులు ఇంటర్వ్యూ అడిగినా సున్నితంగా తిరస్కరిస్తున్నాను. ఈ ఆర్టికల్లో బీఆర్ఎస్ పెద్దలు నన్ను బలి పశువు చేస్తున్నట్టు చిత్రీకరించారు..
నేను వ్యక్తిగతంగా తెలిసిన వందల జర్నలిస్టులకు నా విద్య, పరిశోధన సామర్థ్యం తెలుసు. వారికే కాదు కాంగ్రెస్‌లో ఉన్న ఎంతో మంది పెద్దలకు కూడా తెలుసు. నేను గత 17 సంవత్సరాల నుంచి తెలంగాణ విద్యార్థి ఉద్యమంతో మొదలుపెట్టి ఇప్పటివరకు జాతీయ నుంచి రాష్ట్రస్థాయి మీడియా చర్చల్లో ప్రజల అంశాలపై పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నాను. అలాంటిది నాకు ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారని, వారు ఇచ్చిన స్క్రిప్ట్‌ని మాత్రమే నేను చదువుతున్నానని, నా అర్హతను అవమానపరుస్తూ రాశారు.
నేను ప్రెస్ మీట్ పెట్టే ముందు ఏ విషయంపై పెడుతున్నానో దానికి సంబంధించి ఎలాంటి సమాచారం కేటీఆర్‌కి కానీ, హరీశ్ రావుకి (Harish Rao) కానీ ఏ మాత్రం తెలీదు. అడుగుతున్న ప్రశ్నలకు కేసులు ప్రభుత్వం వేస్తున్నది, తప్పుడు కేసులు కక్షపూరితంగా పెడుతున్న ఆ ప్రభుత్వాన్ని మీడియాగా నిలదీయకుండా మా పార్టీలో చిచ్చు పెట్టడం ఇదెక్కడి జర్నలిజం. ఒక్కరోజు రెండు వేరు వేరు చోట్ల కేసులు, ఒక లాయర్స్ టీం ఇంటికి చేరుకుంది, ఒక లాయర్స్ టీం గోపాలపురం పోలీసులు వేసిన కేసును ఎదుర్కోవడానికి సికింద్రాబాద్ కోర్టు వద్ద ఉంది. ఇంకొక లాయర్స్ బృందం సీసీఎస్ వేసిన కేసులో గౌరవ హైకోర్టులో లంచ్ మోషన్ వేసింది. ఒక కేసులో హైకోర్టు అరెస్టు చేయవద్దు నోటీసు మాత్రమే అని, ఇంకొక కేసులో సికింద్రాబాద్ కోర్టు షరతులు లేని బేలు మంజూరు చేసింది. ఈ లాయర్లు ఉండేలా ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేసింది బీఆర్ఎస్ నాయకత్వం.
బెయిల్ వచ్చిందని తెలుగు 360 వారికి ఎందుకు అంత బాధ కలుగుతుంది?. పోలీసులు కఠినమైన సెక్షన్లు వేయాలని రాయడంలో ఆంతర్యం ఏమిటి?. ఒక సామాన్యుడు రాజకీయంలో ఎదుగొద్దా?, సొంత పార్టీలోనే చిచ్చు పెట్టే విధంగా రిపోర్టింగ్ చేయడం ఎంతవరకు సబబు?. మేము అడిగిన ప్రశ్నల్లో తప్పుంటే చట్టపరంగా చర్యలు తీసుకోండి, లేదు రాజకీయంగా సహాయం చేయాలనుకుంటే మద్దతు చేయండి. కానీ నాకు జాలి చూపిస్తున్నట్టు నాటకం చేసి, నన్ను తొక్కే ప్రయత్నం చేయకండి.
తెలుగు 360 రచయిత రమేష్ గారు.. మీరు జీవితాంతం అదే సంస్థలో కొనసాగుతారో లేదో తెలీదు. కానీ మీరు రాసే రాతలతో, జీవితాంతం ఏదో సాధించాలని పోరాడుతున్న మాలాంటి భవిష్యత్తుకు ఇబ్బంది కలిగించకండి` అని మన్నె క్రిశాంత్ అన్నారు.
తాజావార్తలు
- ●Kiara Advani | రెండోసారి తల్లికాబోతున్న స్టార్ నటి
- ●PM Modi | ప్రజల ఆశీర్వాదమే నా బలం.. ప్రతి అనుభవం ఓ పాఠమే : ప్రధాని మోదీ
- ●Paytm | పేటీఎం-వీసా బంఫర్ ఆఫర్.. మెట్రో టిక్కెట్లు, రీచార్జిలపై 50 శాతం డిస్కౌంట్..
- ●Electric Shock | పొలంలో తెగిపడిన కరెంటు వైరు.. విద్యుత్ షాక్ రైతు మృతి
- ●RBI Governor | ఎల్‌నినో ఎఫెక్ట్.. రబీ పంటలకు భారీ ముప్పు.. ఆర్బీఐ గవర్నర్ వెల్లడి..
- ●Santhosh Kumar | ఆకలి తీరిన ఆ అమృత ఘడియలో.. జగత్తునే జయించినట్టు!

Kiara Advani | రెండోసారి తల్లికాబోతున్న స్టార్ నటి

PM Modi | ప్రజల ఆశీర్వాదమే నా బలం.. ప్రతి అనుభవం ఓ పాఠమే : ప్రధాని మోదీ

Paytm | పేటీఎం-వీసా బంఫర్ ఆఫర్.. మెట్రో టిక్కెట్లు, రీచార్జిలపై 50 శాతం డిస్కౌంట్..

Electric Shock | పొలంలో తెగిపడిన కరెంటు వైరు.. విద్యుత్ షాక్ రైతు మృతి






