Oregon School Shooting | స్కూల్లో టీనేజర్ కాల్పులు.. ముగ్గురు చిన్నారులు సహా నలుగురు మృతి
Oregon School Shooting | అమెరికాలో మరోసారి కాల్పులు (gunfire) కలకలం సృష్టించాయి. ఒరెగాన్ రాష్ట్రంలోని బెండ్ నగరంలో ఉన్న సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్లో (Oregon School Shooting) ఓ టీనేజర్ కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ముగ్గురు చిన్నారులు, ఓ ఉపాధ్యాయుడు మృతిచెందారు.
International | Published On Oct 16, 2026, 7.21 am IST
Oregon School Shooting | త్రినేత్ర న్యూస్: అమెరికాలో మరోసారి కాల్పులు (gunfire) కలకలం సృష్టించాయి. ఒరెగాన్ రాష్ట్రంలోని బెండ్ నగరంలో ఉన్న సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్లో (Oregon School Shooting) ఓ టీనేజర్ కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ముగ్గురు చిన్నారులు, ఓ ఉపాధ్యాయుడు మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే నిందితుడు కూడా మరణించాడు. గాయపడిన ఇద్దరిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానేఉందని పోలీసులు తెలిపారు. బెండ్ (Bend city) పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతినిధి షీలా మిల్లర్ మాట్లాడుతూ.. మొదట ఒక కారుపై కాల్పులు జరిగాయని, ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే పాఠశాల లోపల కాల్పులు జరుగుతున్నట్లు పలు ఎమర్జెన్సీ కాల్స్ వచ్చాయని చెప్పారు.
కాల్పులకు పాల్పడిన వ్యక్తి 16 ఏండ్ల వ్యక్తి అని చెప్పారు. కాల్పుల సమయంలో సుమారు 450 మంది విద్యార్థులు, 40 మంది సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు. ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో నిందితుడు మరణించినట్లు పేర్కొన్నారు. అయితే, ఆ అనుమానితుడ్ని ఎవరు కాల్చి చంపారనేది ఇంకా స్పష్టత రాలేదన్నారు. మృతులు 5, 8, 11 ఏళ్లు చిన్నారులని, కనీసం ఇద్దరిని స్థానిక ఆసుపత్రికి తరలించామని చెప్పారు.
సంబంధిత వార్తలు

Trump Xi Jinping Summit US China | ట్రంప్ – జిన్పింగ్ మెగా సమ్మిట్: ఏఐ, ట్రేడ్, మిడిల్ ఈస్ట్ యుద్ధంపై ప్రపంచం దృష్టి
సెప్టెంబర్ 24, 2026

MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్కు అనుమతిచ్చి రేవంత్కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న
ఆగస్టు 25, 2026

Nirmal Student | పుట్టినరోజు నాడే.. అమెరికాలో నిర్మల్ యువకుడి దుర్మరణం
జులై 24, 2026
తాజావార్తలు
- ●UCO Bank | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు
- ●Horoscope | అక్టోబర్ 16 రాశిఫలాలు.. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది!
- ●ప్రజలారా..పెద్ద మనసు చేసుకోండి.. సీఎం రేవంత్ రెడ్డి
- ●Jailer 2 OTT | రజనీకాంత్ జైలర్ 2 ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే - నెల రోజుల్లోనే స్ట్రీమింగ్
- ●Poonam Bajwa | స్విమ్మింగ్పూల్లో టాలీవుడ్ హీరోయిన్ - బికినీ అందాలతో రచ్చ
- ●Rashmika Mandanna | రణబాలి కోసం రష్మిక మందన్న తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే?

UCO Bank | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు

Horoscope | అక్టోబర్ 16 రాశిఫలాలు.. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది!

ప్రజలారా..పెద్ద మనసు చేసుకోండి.. సీఎం రేవంత్ రెడ్డి

Jailer 2 OTT | రజనీకాంత్ జైలర్ 2 ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే - నెల రోజుల్లోనే స్ట్రీమింగ్



