త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Basara Temple | బాసరలో మూల నక్షత్ర వేడుకలు.. భారీగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు

Basara Temple | బాసర శ్రీ స‌ర‌స్వ‌తీ అమ్మ‌వారి ఆల‌యంలో (Basara Temple) దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నేడు మూల నక్షత్ర పర్వదినం (Mula Nakshatram) సందర్భంగా.. అమ్మ‌వారు కాత్యాయనీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

G

Telangana | Published On Oct 16, 2026, 8.49 am IST

Basara Temple | బాసరలో మూల నక్షత్ర వేడుకలు.. భారీగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు
Advertisement

Basara Temple | త్రినేత్ర న్యూస్‌: బాసర శ్రీ స‌ర‌స్వ‌తీ అమ్మ‌వారి ఆల‌యంలో (Basara Temple) దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నేడు మూల నక్షత్ర పర్వదినం (Mula Nakshatram) సందర్భంగా.. అమ్మ‌వారు కాత్యాయనీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి మూల నక్షత్రం (Mula Nakshatram) రోజున అక్షర శ్రీకారాలు (Aksharabhyasam) చుట్టిస్తే ప్రయోజనం చేకూరుతుందనే నమ్మకంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. జ్ఞానప్రదాయిని అయిన అమ్మవారి ఆశీస్సులు పొందితే విద్యాభివృద్ధి కలుగుతుందన్న విశ్వాసంతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

శరన్నవరాత్రి వేడుకల నేపథ్యంలో బాసర క్షేత్రం (Gnana Saraswati Temple) ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు భక్తిమయంగా మారాయి. భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లిరావ‌డంతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు అధికారులు. సుమారు 200 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి విధుల నిర్వహిస్తున్నారు.

Advertisement
Advertisement