త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manjeera | అక్టోబ‌ర్ 2న మంజీరా ర‌చ‌యిత‌ల సంఘం మ‌హాస‌భ‌

Manjeera | అక్టోబ‌ర్ 2వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్ వేదిక‌గా మంజీరా ర‌చ‌యిత‌ల సంఘం న‌లభై ఏళ్ల మ‌హాస‌భ నిర్వ‌హించ‌నున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు.

S

Telangana | Published On Sep 30, 2026, 1.04 pm IST

Manjeera | అక్టోబ‌ర్ 2న మంజీరా ర‌చ‌యిత‌ల సంఘం మ‌హాస‌భ‌
Advertisement

Manjeera | త్రినేత్ర న్యూస్ : అక్టోబ‌ర్ 2వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్ వేదిక‌గా మంజీరా ర‌చ‌యిత‌ల సంఘం న‌లభై ఏళ్ల మ‌హాస‌భ నిర్వ‌హించ‌నున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. మ‌రసం అధ్య‌క్షులు కే రంగాచారి అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం కొన‌సాగ‌నుంది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హ‌రీశ్‌రావు పాల్గొననున్నారు. ఈ స‌మావేశంలో మ‌ర‌సం ప్ర‌యాణం - అనుభ‌వాలపై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఈ చ‌ర్చ‌లో నందిని సిధారెడ్డి, దేశ‌ప‌తి శ్రీనివాస్, దేవీ ప్ర‌సాద్, కే విరాహ‌త్ అలీ, నాళేశ్వ‌రం శంక‌రం, కే అంజ‌య్య‌, అలాజ్‌పూర్ కిష‌న్, ఎన్ భ‌గ‌వాన్ రెడ్డి, జీ తిరుప‌తి రెడ్డి, తోట అశోక్ వ‌క్త‌లుగా పాల్గొన‌నున్నారు. ఇక మ‌హిళా దృక్ప‌థంపై నెల్లుట్ల ర‌మాదేవి, ద‌ళిత, ద్రావిడ దృక్ప‌థంపై కోయి కోటేశ్వ‌ర రావు ప్ర‌సంగించ‌నున్నారు. ఈ మ‌రసం స‌భ‌లో ప‌లువురు క‌వులు పాల్గొన‌నున్నారు.

Advertisement
Advertisement