త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HMD Vibe2 Pro 5G | హెచ్‌ఎండీ నుంచి కొత్త 5జి ఫోన్.. ధర రూ.14,999, అదిరే ఫీచర్లు..

HMD Vibe2 Pro 5G | భారత మార్కెట్లో హెచ్‌ఎండీ కొత్త వైబ్‌2 ప్రొ 5జి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మధ్యశ్రేణి విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ప్రాసెసర్, డిస్‌ప్లే, ప్రధాన కెమెరా, బ్యాటరీతోపాటు భారత వినియోగదారుల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఫీచ‌ర్‌లను అందించింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న వైబ్‌2 5జికి కొనసాగింపుగా వచ్చింది.

S

Technology | Published On Sep 30, 2026, 2.03 pm IST

HMD Vibe2 Pro 5G | హెచ్‌ఎండీ నుంచి కొత్త 5జి ఫోన్.. ధర రూ.14,999, అదిరే ఫీచర్లు..
Advertisement

HMD Vibe2 Pro 5G | భారత మార్కెట్లో హెచ్‌ఎండీ కొత్త వైబ్‌2 ప్రొ 5జి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మధ్యశ్రేణి విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ప్రాసెసర్, డిస్‌ప్లే, ప్రధాన కెమెరా, బ్యాటరీతోపాటు భారత వినియోగదారుల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఫీచ‌ర్‌లను అందించింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న వైబ్‌2 5జికి కొనసాగింపుగా వచ్చింది. వైబ్‌2 ప్రొ 5జిలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను అందించారు. ఇది 5జి కనెక్టివిటీకి అనుకూలమైన ఆక్టాకోర్ చిప్‌సెట్. ఇందులో 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజీని 2టీబీ వరకు పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ సదుపాయం కూడా ఉంది.

భారీ బ్యాట‌రీ..

ఇందులో 6.78 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. ఇది 1080 * 2460 పిక్స‌ల్‌ రిజల్యూషన్‌తో 120 హెడ్జ్‌ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. గరిష్ఠ బ్రైట్‌నెస్‌ 800 నిట్స్‌గా ఉంది. వెనుక భాగంలో 64 మెగాపిక్స‌ల్ ప్రధాన కెమెరా ఉంది. దీనికి తోడు 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాను అందించారు. ఎల్‌ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. వెనుక కెమెరాతో 1080పి రిజల్యూషన్‌లో సెకనుకు 30 ఫ్రేమ్‌ల వరకు వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ముందువైపు 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా ఉంది. దీనికి కూడా 1080పి 30ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఉంది. ఇందులో 6,000 ఎంఏహెచ్ సామర్థ్యం క‌లిగిన భారీ బ్యాటరీని అమర్చారు. 33 వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఉంది. రిటైల్ బాక్స్‌లోనే 33 వాట్ల ఛార్జర్‌ను హెచ్‌ఎండీ అందిస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. భారత వినియోగదారుల కోసం హెచ్‌ఎండీ కొన్ని ప్రత్యేక స్థానిక సాఫ్ట్‌వేర్ సదుపాయాలను కూడా అందించింది. సర్వం ఏఐ రూపొందించిన ఇండస్ ఏఐ అసిస్టెంట్ ఇందులో ఉంది. ఇది 22 భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. దీనికి సంబంధించిన డేటా మౌలిక వసతులు, సర్వర్లు భారత్‌లోనే ఉన్నాయని హెచ్‌ఎండీ తెలిపింది.

ఇన్‌బిల్ట్ యాప్‌లు..

టెలికమ్యూనికేషన్స్ శాఖకు చెందిన సంచార్ సాథీ సేవను కూడా ఫోన్‌లో నేరుగా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా పోయిన లేదా దొంగిలించబడిన ఫోన్లను గుర్తించడం, ఫోన్ నిజమైనదో కాదో తనిఖీ చేయడం, వినియోగదారుడి పేరుతో నమోదైన సిమ్ కనెక్షన్లను పరిశీలించడం వంటి సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే సంచార్ సాథీ సేవను ఇన్‌స్టాల్ చేయడం వినియోగదారుల ఐచ్ఛికమే. ఇతర ఫీచర్లలో డ్యుయల్ స్పీకర్లు, డ్యుయల్ మైక్రోఫోన్లు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. 5జి ఎస్‌ఏ, ఎన్‌ఎస్‌ఏ, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్‌ఎస్‌ఎస్‌లకు ఫోన్ మద్దతు ఇస్తుంది. దీన్ని సిల్వర్ మిస్ట్, ఆక్వా గ్రీన్, కాస్మిక్ పర్పుల్ రంగుల్లో విడుదల చేశారు. కెమెరా మాడ్యూల్ చుట్టూ ఇరిడిసెంట్ యాక్సెంట్‌ను అందించారు. అలాగే ఇప్పటికే ఉన్న వైబ్‌2 5జికి కొత్త వైన్ రెడ్ రంగు మోడ‌ల్‌ను కూడా సంస్థ పరిచయం చేసింది.

ధ‌ర వివ‌రాలు..

హెచ్‌ఎండీ వైబ్‌2 ప్రొ 5జి 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ మోడల్ ధరను రూ.14,999గా నిర్ణయించింది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. ఈ ఫోన్ అక్టోబర్ 8 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి రానుంది. అయితే అదే రోజు నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. విక్రయం ప్రారంభమైన తర్వాత హెచ్‌ఎండీకి చెందిన 200కు పైగా సర్వీస్ సెంటర్ల ద్వారా అమ్మకాల అనంతర సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే 18వేల‌కు పైగా పోస్టల్ కోడ్‌ల పరిధిలో పికప్, డ్రాప్ సర్వీస్ సదుపాయం కూడా ఉంది.

Advertisement
Advertisement