Man Hit by Bus in Hanumakonda | మరోసారి ట్రాఫిక్ సెన్స్‌పై చర్చ.. ఎందుకో ఈ వీడియో చూడండి..!
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు మీదికి వచ్చినప్పుడు ట్రాఫిక్ సెన్స్ ఉండాలి కదా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాహనాలు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎదుటివారే జాగ్రత్తగా ఉండాలి.
Man Hit by Bus in Hanumakonda | మన దేశంలో సివిక్ సెన్స్, ట్రాఫిక్ సెన్స్, కామన్ సెన్స్ ఇవేమీ ఉండవు.. ఇవన్నీ మనకు నాన్సెన్స్ అంటూ సోషల్ మీడియాలో చాలామంది మన దేశం వాళ్లే మన మీద ట్రోల్స్ చేస్తుంటారు. ఎక్కడో జరిగిన ఒకటి రెండు సంఘటనల ఆధారంగా మనకు ఏ సెన్స్ లేదని చెప్పలేం కానీ.. కొన్ని విషయాల్లో మాత్రం ఒప్పుకోక తప్పదు. దానికి తాజా ఘటనే ఉదాహరణ.
ఈ ఘటన తెలంగాణలోని హనుమకొండలో చోటు చేసుకుంది. పట్టణంలోని అశోక జంక్షన్ సిగ్నల్ వద్ద ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. అప్పుడే సిగ్నల్ పడటంతో ఓ బస్సు వేగంగా రోడ్డును క్రాస్ చేస్తోంది. బస్సు వేగంగా ఉండటం, ఆ వ్యక్తి కూడా బస్సు దగ్గరికి వస్తున్నా ఏమాత్రం భయం లేకుండా ఆ బస్సు ముందు నుంచే రోడ్డును క్రాస్ చేయబోయాడు. ఆ వ్యక్తి వెళ్లిపోతాడులే అని బస్సు డ్రైవర్ అనుకున్నాడో, లేదంటే బస్సు తనను ఢీకొట్టకుండా వెళ్లిపోతుంది అని ఆ వ్యక్తి అనుకున్నాడో తెలియదు కానీ.. బస్సు మాత్రం అతడిని ఢీకొట్టడంతో బస్సు కింద పడిపోయాడు. వెనుక టైర్ కూడా సగం వరకు అతడి మీద ఎక్కింది. ఇంతలో అక్కడే ఉన్న ఇతర వాహనదారులు గగ్గోలు పెట్టడంతో బస్సు డ్రైవర్ బస్సును వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత అతడిని బస్సు కింది నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. అతడి ప్రస్తుత పరిస్థితి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు మీదికి వచ్చినప్పుడు ట్రాఫిక్ సెన్స్ ఉండాలి కదా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాహనాలు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎదుటివారే జాగ్రత్తగా ఉండాలి.. అందుకే ట్రాఫిక్ సెన్స్ అనేది కంపల్సరీ అంటూ హితువు పలుకుతున్నారు.
https://x.com/TheStatesmanLtd/status/2025132854410428604
సంబంధిత వార్తలు

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



