త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

National Conference | ఆర్టీఐపై హైదరాబాద్ వేదిక‌గా జాతీయ స‌ద‌స్సు

National Conference | సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అమలులో ఏకరూపత, పారదర్శకత, సామర్థ్యం పెంపుపై తెలంగాణ సమాచార కమిషన్‌ (టీజీఐసీ) ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు జరగనుంది. ‘ఆర్టీఐ అమలులో ఆపరేషనల్‌ యూనిఫార్మిటీ–సవాళ్లు, పరిష్కారాలు’ అనే అంశంపై ఈ నెల 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌సీఐ)లో ఈ సదస్సును నిర్వహించనున్నారు.

P

Telangana | Published On Sep 9, 2026, 6.57 pm IST

National Conference | ఆర్టీఐపై హైదరాబాద్ వేదిక‌గా జాతీయ స‌ద‌స్సు
Advertisement

National Conference | సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అమలులో ఏకరూపత, పారదర్శకత, సామర్థ్యం పెంపుపై తెలంగాణ సమాచార కమిషన్‌ (టీజీఐసీ) ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు జరగనుంది. ‘ఆర్టీఐ అమలులో ఆపరేషనల్‌ యూనిఫార్మిటీ–సవాళ్లు, పరిష్కారాలు’ అనే అంశంపై ఈ నెల 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌సీఐ)లో ఈ సదస్సును నిర్వహించనున్నారు. నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్స్‌ ఇన్‌ ఇండియా (ఎన్‌ఎఫ్‌ఐసీఐ) సహకారంతో, ఏఎస్‌సీఐ భాగస్వామ్యంతో కార్యక్రమం చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం అమలులో ఎదురవుతున్న సవాళ్లు, వివిధ సమాచార కమిషన్లలో అనుసరిస్తున్న విధానాలు, ప్రజలకు సమాచారాన్ని వేగంగా అందించే మార్గాలపై సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. సుమారు 20 రాష్ట్రాల చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్లు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. వీరిలో పలువురు మాజీ ప్రధాన కార్యదర్శులు, సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఉన్నారు. న్యాయ నిపుణులు, విధాన నిర్ణేతలు, ఉన్నతాధికారులు సైతం పాల్గొననున్నారు.

ముఖ్య అతిథిగా గ‌వ‌ర్న‌ర్‌

సదస్సు ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివ్ ప్ర‌తాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజ‌రై కీల‌కోప‌న్యాసం చేయ‌నున్నారు. మాజీ కేంద్ర సమాచార కమిషనర్‌ హీరాలాల్‌ సమారియా, ఛత్తీస్‌గఢ్‌ మాజీ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా, తమిళనాడు మాజీ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ షకీల్‌ అహ్మద్ త‌దిత‌రులు పాల్గొని ప్ర‌సంగిస్తారు. కాన్ఫ‌రెన్స్‌లో ఆర్టీఐ అమలులో విధానాలు, ప్రక్రియల్లో ఏకరూపత తీసుకురావడం, పెండింగ్‌ కేసులను తగ్గించడం, కేసుల సత్వర పరిష్కారం, సమర్థవంతమైన విచారణ విధానాలు, సెక్షన్‌ 4 కింద ముందస్తు సమాచార వెల్లడి, ఆర్టీఐ ప్రక్రియల డిజిటలైజేషన్‌ వంటి అంశాలపై చర్చించనున్నారు. పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారులు (పీఐఓ), ఫస్ట్‌ అప్పిలేట్‌ అథారిటీల సామర్థ్య పెంపు, ఆర్టీఐ దుర్వినియోగాన్ని అరికడుతూనే అర్హులైన పౌరులకు సమాచార హక్కును పరిరక్షించడం, సమాచార కమిషన్ల స్వతంత్రత, సమర్థతను బలోపేతం చేయడంపైనా చర్చలు జరగనున్నాయి.

Advertisement
Advertisement