Etala Rajender | జవహర్ నగర్ డంప్ యార్డుపై కేంద్రానికి ఫిర్యాదు చేశా : ఎంపీ ఈటల
Etala Rajender | జవహర్ నగర్ ప్రజల ఊపిరి తీసేలా ఏర్పడిన డంప్ యార్డ్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను రీసైకిల్ చేయాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Etala Rajender | త్రినేత్ర.న్యూస్ : జవహర్ నగర్ ప్రజల ఊపిరి తీసేలా ఏర్పడిన డంప్ యార్డ్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను రీసైకిల్ చేయాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఎంపీ ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ జనాభా 30 లక్షల మంది ఉన్నప్పుడు ఏర్పాటు చేసింది జవహర్ నగర్ డంపుయార్డ్. ఇప్పుడు రెండు కోట్ల మంది జనాభాకు కూడా అక్కడ ఒక్కదగ్గరే చెత్త వేస్తున్నారు. గుట్టలుగా పేరుకుపోయిన చెత్త వల్ల 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లక్షలమంది ఆరోగ్యం దెబ్బతిన్నది. సంపాదించినదంతా హాస్పిటల్స్‌కి ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ విషయంపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ని కలిశాను.. 10 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఒక దగ్గర వేయడం శ్రేయస్కరం కాదని.. శాశ్వత పరిష్కారం చూపాలని కోరాను. ఒక్క కిలో చెత్త కూడా వేయకుండా చూడాలని కోరినట్లు ఎంపీ ఈటల తెలిపారు.
వాయు, నీటి కాలుష్యం లేకుండా జీరో పొల్యూషన్‌తో చెత్తను రీసైకిల్ చేయించాలని విజ్ఞప్తి చేశాను. ఢిల్లీ లాంటి నగరంలో చెత్తను మేనేజ్ చేస్తున్నాము.. హైదరాబాద్‌లో కూడా ఆ పద్ధతులు అవలంబించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ జనరేట్ స్టేషన్ ఉన్నా అది పని చేస్తుందో లేదో తెలియదు. పర్యవేక్షణ లేదు. దాని కెపాసిటీ 3500 మెట్రిక్ టన్నులు అయితే వచ్చేది 10 వేల మెట్రిక్ టన్నులు. నేను సుప్రీం కోర్టులో కేసు వేశాను. అప్పటి ఎంపీ రేవంత్ రెడ్డి కూడా కేసు వేశారు.. ఆయనే ఇప్పుడు సీఎం అయ్యారు అయినా ఫలితం లేకుండా పోయిందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
ఆగస్టు 12, 2026

CM Revanth Reddy | ఆ మూడు ప్రాజెక్టులకు ఎన్డీఎస్ఏ సూచనలు పాటించండి.. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయండి
ఆగస్టు 12, 2026

TGSWREIS | గురుకుల విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచితంగా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్.. వివరాలివే..!
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక
- ●Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు
- ●Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
- ●Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
- ●Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..

Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక

Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు

Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?

Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన



