PGRRCDE | పీజీఆర్‌ఆర్‌సీడీఈ దూరవిద్య కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
PGRRCDE | ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జీ రామ్‌రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (PGRRCDE) 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు కేంద్రం డైరెక్టర్ తెలిపారు.
- సెప్టెంబర్ 11 వరకు అవకాశం
- అక్టోబర్ 15 నుంచి ఆన్‌లైన్ తరగతులు
PGRRCDE | ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జీ రామ్‌రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (PGRRCDE) 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు కేంద్రం డైరెక్టర్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ, వివిధ విభాగాల్లో ఎంఏ, ఎంకామ్, గణితం, గణాంకశాస్త్రంలో ఎమ్మెస్సీ, బీఏ (నిర్దిష్ట కాంబినేషన్లు), బీకామ్ (జనరల్), బీబీఏతో పాటు అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు, వేద జ్యోతిష్యంలో అడ్వాన్స్‌డ్ పీజీ డిప్లొమా, యోగా సర్టిఫికేట్ కోర్సు, ఇతర సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
ప్రతి కోర్సుకు అర్హత నిబంధనలు వేర్వేరుగా ఉంటాయని అధికారులు తెలిపారు. యూజీసీ–డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో (UGC-DEB) మార్గదర్శకాల మేరకు ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) విధానంలో ఈ కోర్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్ ప్రవేశ ప్రక్రియ ఆగస్టు 1 నుంచి ప్రారంభమైందని, దరఖాస్తుల సమర్పణకు సెప్టెంబర్ 11 చివరి తేదీగా నిర్ణయించినట్లు వెల్లడించారు. అన్ని కోర్సులకు ఆన్‌లైన్ కాంటాక్ట్ తరగతులు అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. పీజీ కోర్సుల వ్యవధి రెండు సంవత్సరాలు (నాలుగు సెమిస్టర్లు), యూజీ కోర్సుల వ్యవధి మూడు సంవత్సరాలు (ఆరు సెమిస్టర్లు) ఉంటుంది.
యోగా సర్టిఫికేట్ కోర్సు ఒక సంవత్సరం, ఇతర సర్టిఫికేట్ కోర్సులు ఆరు నెలల వ్యవధిలో పూర్తవుతాయి. కోర్సుల అర్హత, ఫీజు నిర్మాణం, సిలబస్, బోధనా మాధ్యమం, ఈ-లెర్నింగ్ మెటీరియల్, అకాడెమిక్ క్యాలెండర్, ఆన్‌లైన్ నమోదు, ప్రవేశ విధానం తదితర పూర్తి వివరాలను పీజీఆర్‌ఆర్‌సీడీఈ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని డైరెక్టర్ తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే వారందరికీ సౌకర్యవంతమైన, నాణ్యమైన విద్యను అందించడమే కేంద్రం లక్ష్యమని ఆయన వివరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..
- ●Harish Rao | ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమన్న హామీ ఏమైంది రేవంత్?: హరీశ్ రావు
- ●Anupama Parameswaran | అతడో అపరిచితుడు - సెట్స్‌లో ఏడ్చిన రోజులు ఉన్నాయి - మాజీ ప్రియుడిపై అనుపమ ఆరోపణలు
- ●Tejas Express | మారిన తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరు.. ఇకపై ఏమని పిలుస్తారంటే?
- ●Srinivas Rao | కేసీఆర్ బావమరిది శ్రీనివాస్‌రావు కన్నుమూత

Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం

Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..

Harish Rao | ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమన్న హామీ ఏమైంది రేవంత్?: హరీశ్ రావు

Anupama Parameswaran | అతడో అపరిచితుడు - సెట్స్‌లో ఏడ్చిన రోజులు ఉన్నాయి - మాజీ ప్రియుడిపై అనుపమ ఆరోపణలు





