Calcutta High Court | మదర్సాల్లో వందేమాతరం ఆలపిస్తే ఆకాశమేమీ ఊడిపడదు.. కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Calcutta High Court | మదర్సాల్లో (madrasas) వందేమాతరం (Vande Mataram) గేయం పాడితే ఆకాశమేమీ ఊడిపడదు (heavens will not fall) అని కలకత్తా హైకోర్టు (Calcutta High Court) వ్యాఖ్యానించింది.
Calcutta High Court | మదర్సాల్లో (madrasas) వందేమాతరం (Vande Mataram) గేయం పాడితే ఆకాశమేమీ ఊడిపడదు (heavens will not fall) అని కలకత్తా హైకోర్టు (Calcutta High Court) వ్యాఖ్యానించింది. మదర్సాల్లో వందేమాతరం గేయంలోని మొత్తం ఆరు చరణాలను ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ కలకత్తా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ACJ) తపబ్రత చక్రవర్తి, జస్టిస్ పార్థసారథి సేన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
వేలాది క్రైస్తవ పాఠశాలల్లో విద్యార్థులందరూ ప్రార్థనలు చేస్తారని, ఇతర మతాల విద్యార్థులు దానిని ప్రశ్నించరని గుర్తుచేసింది. ఒకవేళ తమ మతానికి చెందని ఒక మంచి మాటను లేదా గేయాన్ని పలకడం వల్ల ఎవరూ తమ స్వమతాన్ని కోల్పోరని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. "విద్యార్థులందరినీ దేవుడిని ప్రార్థించమని కోరే వేలాది క్రైస్తవ పాఠశాలలు ఉన్నాయి. అప్పుడు క్రైస్తవ మతానికి సంబంధించిన విషయాలను మాతో ఎందుకు చదివిస్తున్నారు..? అని ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన విద్యార్థులు ఎప్పుడైనా ప్రశ్నించారా..? అలా చేస్తే ఆకాశమేమీ ఊడిపడదు కద. ఒకవేళ ఎవరైనా నన్ను ఈ రోజు నా మతానికి చెందని ఓ విషయాన్ని చెప్పమని అడిగితే ఏమవుతుంది..? అలా చెప్పినంత మాత్రాన నేను నా మతానికి చెందిన వ్యక్తిని కాకుండా పోతానా..?" అంటూ ధర్మాసనం ప్రశ్నించింది.
వందేమాతరం జాతీయ గేయంగా గుర్తింపు పొందినప్పటికీ.. మదర్సాల్లో చదువుతున్న పిల్లలు దీనిని పాడడాన్ని తప్పనిసరి చేయలేమని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది వాదించారు. 'వందేమాతరం'లోని మొత్తం ఆరు చరణాలను పాడడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొన్నారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు, ఎంతో చర్చ తర్వాత కేవలం రెండు చరణాలను మాత్రమే పాడాలని నిర్ణయించారని గుర్తు చేశారు. ఎవరైనా స్వచ్ఛందంగా పాడాలనుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. కానీ దీన్ని బలవంతంగా రుద్దకూడదని వ్యాఖ్యానించారు. ఇది మత సామరస్యానికి భంగం కలిగిస్తుందని పేర్కొన్నారు.
వాదనలు విన్న ధర్మాసనం.. ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయడానికి ఎవైనా చర్యలు తీసుకున్నారా..? అని ప్రశ్నించింది. అయితే, ఇప్పటి వరకూ అలాంటి సాహసం చేయలేదని పిటిషనర్ల తరఫు సీనియర్ కౌన్సిల్ బదులిచ్చారు. దీంతో వందేమాతరం పాడలేదనే కారణంతో ఇప్పటివరకు ఎవరిపైనా ఎలాంటి కఠిన లేదా శిక్షాత్మక చర్యలు తీసుకోలేదని, కేవలం ఊహాజనిత భయాలతోనే ఈ పిటిషన్ దాఖలు చేశారని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ ఉత్తర్వుపై తక్షణమే స్టే ఇచ్చేందుకు కలకత్తా హైకోర్టు నిరాకరించింది. దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.
Also Read..
కోర్టు విచారణలపై వార్తా సంస్థలు రిపోర్టింగ్ చేయొచ్చు.. కానీ : సుప్రీంకోర్టు
నిరాహార దీక్ష చేయ్.. కానీ నీళ్లు తాగు : దేవేంద్ర నాథ్ మహతోకు నచ్చజెప్పిన వాంగ్‌చుక్
సంబంధిత వార్తలు

Abhishek Porel | ఐపీఎల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్.. పెళ్లి చేసుకుంటానని అత్యాచారం చేశాడని ఆరోపణలు..
ఆగస్టు 11, 2026

Tamil Thai Vazthu | వందేమాతరం కాదు.. తమిళ్ తాయ్ వాళ్తు ఫస్ట్.. తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
ఆగస్టు 10, 2026

Har Ghar Tiranga | హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనండి.. దేశప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
ఆగస్టు 9, 2026
తాజావార్తలు
- ●Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..
- ●Harish Rao | ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమన్న హామీ ఏమైంది రేవంత్?: హరీశ్ రావు
- ●Anupama Parameswaran | అతడో అపరిచితుడు - సెట్స్‌లో ఏడ్చిన రోజులు ఉన్నాయి - మాజీ ప్రియుడిపై అనుపమ ఆరోపణలు
- ●Tejas Express | మారిన తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరు.. ఇకపై ఏమని పిలుస్తారంటే?
- ●Srinivas Rao | కేసీఆర్ బావమరిది శ్రీనివాస్‌రావు కన్నుమూత

Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం

Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..

Harish Rao | ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమన్న హామీ ఏమైంది రేవంత్?: హరీశ్ రావు

Anupama Parameswaran | అతడో అపరిచితుడు - సెట్స్‌లో ఏడ్చిన రోజులు ఉన్నాయి - మాజీ ప్రియుడిపై అనుపమ ఆరోపణలు



