Stock Markets | తీవ్ర అస్థిరతతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. స్వల్ప లాభాల్లో సూచీలు..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. రోజంతా ఒడిదొడుకుల మధ్య ట్రేడింగ్ కొనసాగినప్పటికీ, చివరికి ప్రధాన సూచీలు లాభాల్లో స్థిరపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 152.05 పాయింట్లు పెరిగి 78,581.00 వద్ద ముగియగా, ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 9.75 పాయింట్లు లాభపడి 24,624.65 వద్ద స్థిరపడింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. రోజంతా ఒడిదొడుకుల మధ్య ట్రేడింగ్ కొనసాగినప్పటికీ, చివరికి ప్రధాన సూచీలు లాభాల్లో స్థిరపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 152.05 పాయింట్లు పెరిగి 78,581.00 వద్ద ముగియగా, ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 9.75 పాయింట్లు లాభపడి 24,624.65 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఎన్‌టీపీసీ షేర్లు అత్యధిక లాభాలను నమోదు చేశాయి. మరోవైపు టీసీఎస్, అపోలో హాస్పిటల్స్, హెచ్‌సీఎల్ టెక్, సన్ ఫార్మా, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. సెక్టార్ల వారీగా చూస్తే మెటల్, ఆటో రంగాల షేర్లు మార్కెట్‌లకు మద్దతుగా నిలిచాయి. అయితే మీడియా, బ్యాంకింగ్ రంగాల షేర్లు బలహీన ప్రదర్శన కనబరిచాయి.
ఆర్‌బీఐ గణాంకాలతో జోరు..
విస్తృత మార్కెట్‌లలో కూడా సానుకూల ధోరణి కొనసాగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ రెండూ లాభాలతో ముగిశాయి. మార్కెట్ అస్థిరతకు సూచికగా భావించే ఇండియా విక్స్ 1.06 శాతం తగ్గి 12.06 వద్ద ముగిసింది. ఇది మార్కెట్‌లో ఒడిదొడుకులు తగ్గిన సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బుధవారం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన సమీక్ష నిర్ణయాన్ని ప్రకటించడంతో ఉదయం ట్రేడింగ్‌లో సూచీలు తీవ్ర అస్థిరతకు లోనయ్యాయి. తరువాత సూచీలు ఇంట్రా డే కనిష్టానికి చేరినా మళ్లీ స్వల్పంగా లాభపడి ముగిశాయి. రెపో రేటును యథాతథంగా ఉంచడంతోపాటు తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన వృద్ధిని సాధించిందని ఆర్‌బీఐ వెల్లడించడంతో మార్కెట్లలో ఉత్సాహం పెరిగింది. అయితే ఇప్పటికే లాభాల్లో ఉన్న పలు రంగాలకు చెందిన షేర్లలో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు కాస్త కరెక్షన్ అవుతున్నట్లు కనిపించింది.
పెరిగిన చమురు ధరలు..
అంతర్జాతీయ మార్కెట్‌లలో చమురు ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. బ్రెండ్ క్రూడ్ ధర 2.55 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 80 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 1.56 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 77 డాలర్లకు వచ్చింది. ఫారెక్స్ మార్కెట్‌లో భారత రూపాయి మెరుగైన ప్రదర్శన చేసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 95.12 వద్ద స్థిరపడ్డ రూపాయి సెషన్‌లో 25 పైసల మేర లాభపడింది. అయితే ప్రస్తుతం మార్కెట్లు కరెక్షన్ దశలో ఉన్నట్లు కనిపిస్తుందని, పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Stock Markets | చమురు ధరల ఆందోళనతో కుదేలైన మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ మళ్లీ నష్టాల్లో..
ఆగస్టు 7, 2026

Stock Markets | ఐటీ షేర్ల జోష్.. మార్కెట్‌లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్ 242 పాయింట్లు డౌన్..
ఆగస్టు 7, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు..
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●Meta Platforms | మెటా ప్లాట్‌ఫామ్స్ ఒక పబ్లిక్ న్యూసెన్స్.. న్యూమెక్సికో కోర్టు షాకింగ్ తీర్పు.. సంస్థకు రూ.5400 కోట్ల జరిమానా..
- ● ఆ ఒక్క క్లిక్‌తో ఖజానా ఖాళీ: 'Boss Scam' పేరుతో చెలరేగుతున్న డిజిటల్ గ్యాంగ్స్!
- ●PM Modi | ఆందోళన వద్దు.. మీకు నేనున్నా: ఎంపీలతో ప్రధాని మోదీ
- ●Allahabad High Court | ఐదు నెలలుగా భర్తతో సంబంధమే లేదు.. ఆత్మహత్యకు ప్రేరేపించడం ఎలా అవుతుంది..?
- ●Google Assistant | ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇక పూర్తిగా జెమిని ఏఐ.. గూగుల్ అసిస్టెంట్‌కు గుడ్‌బై..
- ●Arvind Kejriwal | ప్రజల గొంతుకలను అణచివేసేందుకే సోషల్ మీడియా కొత్త నిబంధనలు : కేజ్రీవాల్

Meta Platforms | మెటా ప్లాట్‌ఫామ్స్ ఒక పబ్లిక్ న్యూసెన్స్.. న్యూమెక్సికో కోర్టు షాకింగ్ తీర్పు.. సంస్థకు రూ.5400 కోట్ల జరిమానా..

ఆ ఒక్క క్లిక్‌తో ఖజానా ఖాళీ: 'Boss Scam' పేరుతో చెలరేగుతున్న డిజిటల్ గ్యాంగ్స్!

PM Modi | ఆందోళన వద్దు.. మీకు నేనున్నా: ఎంపీలతో ప్రధాని మోదీ

Allahabad High Court | ఐదు నెలలుగా భర్తతో సంబంధమే లేదు.. ఆత్మహత్యకు ప్రేరేపించడం ఎలా అవుతుంది..?



