Desapathi Srinivas | విద్యారంగానికి తీరని అన్యాయం.. పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం : ఎమ్మెల్సీ దేశపతి
Desapathi Srinivas | కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా రంగానికి తీరని అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. విద్యా శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను నిర్వీర్యం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
Desapathi Srinivas | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా రంగానికి తీరని అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. విద్యా శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను నిర్వీర్యం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయిస్తున్న నిధుల విషయంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని, చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయి కేటాయింపులు చేసిందని దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం బడ్జెట్ వ్యయంలో విద్యారంగానికి కేవలం 5.98 శాతం మాత్రమే కేటాయించడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.
బడ్జెట్‌లో 5.98 శాతానికే పరిమితం చేయడానికేనా
గత 6-7 ఏళ్ల తెలంగాణ చరిత్రను పరిశీలిస్తే, విద్యారంగానికి బడ్జెట్ వ్యయంలో ఇంత తక్కువ శాతం నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. విజ్ఞాన గనిగా మారాల్సిన తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టాలని చూస్తోంది. విద్యాశాఖను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉంచుకున్నారు. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తే, ఆయన పర్యవేక్షణలోనే విద్యారంగానికి ఈ స్థాయిలో నిధుల కోత విధించడం దారుణం. బడ్జెట్‌లో 5.98 శాతానికే పరిమితం చేయడానికేనా ముఖ్యమంత్రి ఈ శాఖను తన వద్ద పెట్టుకున్నది? అని దేశపతి నిలదీశారు.
రేవంత్ రెడ్డికి ఇష్టం లేదా?
నిధుల కొరత వల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, విశ్వవిద్యాలయాలు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మన విద్యార్థుల భవిష్యత్తును, తెలంగాణ విద్యా వ్యవస్థ పునాదులను ఈ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీస్తోంది. "తెలంగాణ సమాజం విద్యావంతులు కావడం, పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదా?" అని దేశపతి ప్రశ్నించారు. తక్షణమే విద్యారంగానికి కేటాయింపులను పెంచాలని, విద్యా వ్యవస్థను కాపాడే బాధ్యతను ప్రభుత్వం విస్మరిస్తే విద్యార్థి, ఉపాధ్యాయ లోకంతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని దేశపతి శ్రీనివాస్ హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ
ఆగస్టు 6, 2026

Rakesh Reddy | 2028లో నేనే, 2033లో కూడా నేనే.. ఎంతసేపు ఇదే ధ్యాసనా రేవంత్?
ఆగస్టు 6, 2026

ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!
- ●Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!
- ●GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు
- ●Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ
- ●Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!
- ●Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ

India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!

Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!

GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు

Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ



