MLA Prem Sagar Rao | నాకు మంత్రి పదవి రావొద్దనే నాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నరు : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
MLA Prem Sagar Rao | తనకు మంత్రి పదవి ఇస్తారని చర్చ వచ్చిన ప్రతీ సారి నాపై కుట్రలు చేస్తున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మండిపడ్డారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలతో పాటు సాక్షి పత్రికలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.
MLA Prem Sagar Rao | త్రినేత్ర.న్యూస్ : తనకు మంత్రి పదవి ఇస్తారని చర్చ వచ్చిన ప్రతీ సారి నాపై కుట్రలు చేస్తున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మండిపడ్డారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలతో పాటు సాక్షి పత్రికలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.
నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. నాపై ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజా ప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సొంత పేపర్ కాకుండా పక్క పేపర్‌లో నాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టను. త్వరలో కుట్రలు అన్ని బయటకు వస్తాయి. నాపై ఆరోపణలు చేస్తున్న వారు చర్చలకు రావాలని డిమాండ్ చేశారు.
పత్రికలపై లీగల్ యాక్షన్ తీసుకుంటా..
నేను రూ. 450 కోట్లు వాడుకున్నట్లు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదు. 2009-10లో బ్యాంక్ రూ. 450 కోట్లు సాంక్షన్ చేసింది. సాయినాథ్ ప్రయివేట్ లిమిటెడ్‌పై, భాగ్యనగర్ హోటల్స్ పేరుమీద బ్యాంక్ లోను తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నేను 15 స్కూల్స్ కట్టించాను. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను అధికార దుర్వినియోగం చేయలేదు. నేను సాండ్, ల్యాండ్ తీసుకోవాలనుకుంటే అప్పుడే తీసుకునే వాణ్ణి. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న, పత్రికలపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని ప్రేమ్ సాగర్ రావు తేల్చిచెప్పారు.
రూ. 160 కోట్లు లాస్ అయ్యాను
యూఎస్ ట్రేడింగ్ డౌన్ అయిన తర్వాత నేను రూ. 160 కోట్లు లాస్ అయ్యాను. నిజానిర్ధారణ కమిటీ వేస్తే కమిటీ ముందు పూర్తి ఆధారాలు చూపిస్తా. రూ. 450 కోట్లు ఫ్రాడ్ చేస్తే బ్యాంక్ రూ. 109 కోట్లకు ఎలా ఆక్షన్ వేస్తుంది..? సాంక్షన్ ఆర్డర్స్ నేను క్రేయేట్ చేసినవి కాదు. 2014 నుండి 2025 వరకు కంపెనీకి ఫండ్స్ వాడింది రూ. 109 కోట్ల 11 లక్షలు. అన్ని బ్యాంకులు NPA ఇచ్చింది రూ. 109 కోట్ల 11లక్షలు. ఆర్బీఐ, సెబీ రిజిస్టర్డ్ బ్యాంకుల నుంచి లోను తీసుకున్నాం. 2014 నుండి 2025 వరకు రూ. 44 కోట్ల 81లక్షల పేమెంట్ చేశాం. 2014-15లో రిజర్వ్ ప్రైస్ రూ. 168 కోట్లు ఉంది. ఆంధ్రా బ్యాంక్ NPA అయిన తర్వాత రూ. 18 కోట్ల 72 లక్షలు చెల్లించాం. 2024 అక్టోబర్ 31 నుండి పేమెంట్ చేశాం. మా జిల్లా నేతలు నాపై కుట్ర చేశారు. నాపై వచ్చిన ఆరోపణలపై ఎక్కడ చర్చకు అయినా సిద్దమేనని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ
ఆగస్టు 6, 2026

Rakesh Reddy | 2028లో నేనే, 2033లో కూడా నేనే.. ఎంతసేపు ఇదే ధ్యాసనా రేవంత్?
ఆగస్టు 6, 2026

ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!
- ●Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!
- ●GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు
- ●Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ
- ●Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!
- ●Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ

India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!

Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!

GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు

Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ



