త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rishabh Singh Sambyal | ఆర్మీని వీడి.. ఫ్యాషన్‌ రంగంలోకి.. మోడ‌ల్‌గా మారిన‌ రాష్ట్రపతి మాజీ ఏడీసీ

Rishabh Singh Sambyal | రాష్ట్రపతి ‘ఎయిడ్‌-డి-క్యాంప్‌’ (ADC) మాజీ మేజర్‌ రిషభ్‌ సింగ్‌ సంబ్యాల్ (Rishabh Singh Sambyal) ఫ్యాష‌న్ రంగంలోకి అడుగుపెట్టారు. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు (President Droupadi Murmu) ఏడీసీగా వ్య‌హ‌రించిన రిష‌భ్ దేశ‌వ్యాప్తంగా గుర్తింపుపొందిన విష‌యం తెలిసిందే.

G

National | Published On Oct 28, 2026, 7.42 am IST

Rishabh Singh Sambyal | ఆర్మీని వీడి.. ఫ్యాషన్‌ రంగంలోకి.. మోడ‌ల్‌గా మారిన‌ రాష్ట్రపతి మాజీ ఏడీసీ
Advertisement

Rishabh Singh Sambyal | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్రపతి ‘ఎయిడ్‌-డి-క్యాంప్‌’ (ADC) మాజీ మేజర్‌ రిషభ్‌ సింగ్‌ సంబ్యాల్ (Rishabh Singh Sambyal) ఫ్యాష‌న్ రంగంలోకి అడుగుపెట్టారు. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు (President Droupadi Murmu) ఏడీసీగా వ్య‌హ‌రించిన రిష‌భ్ దేశ‌వ్యాప్తంగా గుర్తింపుపొందిన విష‌యం తెలిసిందే. 12 ఏండ్ల‌పాటు ఇండియ‌న్ ఆర్మీలో సేవ‌లందించిన ఆయ‌న‌ ఇటీవ‌ల‌ వ్య‌క్తిగ‌త కారణాలతో ఇటీవల సైన్యాన్ని వీడిన విషయం తెలిసిందే. తాజాగా రిష‌భ్‌ ఓ ష్యాషన్‌ దుస్తుల సంస్థకు మోడల్‌గా మారారు. కంపెనీ ప్రచార కార్యక్రమంలో ఆయన నటి అనుష్క సేన్‌తో (Anushka Sen) కలిసి పాల్గొన్నారు.

జమ్ముక‌శ్మీర్‌కు చెందిన 32 ఏండ్ల రిష‌భ్‌.. 2014 నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (NDA) పూర్తి చేసి భారత సైన్యంలో చేరారు. మిలిటరీ స్టడీస్, డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అభ్యసించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన 'బలిదాన్ బ్యాడ్జ్' సాధించారు. 2021 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కెప్టెన్‌గా ‘జాట్‌ రెజిమెంట్‌’ దళానికి నాయకత్వం వహించి 'బెస్ట్ మార్చింగ్ కాంటింజెంట్' ట్రోఫీని గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. 2023 నుంచి ఆయన రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ముకు ఏడీసీగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. రాష్ట్రపతి అధికారిక కార్యక్రమాల్లో ఆయన సైనిక గంభీర్యంతో, ఆకర్షణీయమైన రూపంతో కనిపించడంతో సోషల్ మీడియాలో `నేషనల్ క్రష్ (National Crush)గా గుర్తింపు తెచ్చుకున్నారు.

 

Advertisement
Advertisement