త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kolkata | బాలిక‌కు ముద్దు పెట్టాడ‌ని తండ్రీకొడుకులను న‌గ్నంగా న‌డిపించారు.. నిందితుల‌ను కూడా..

Kolkata | దక్షిణ కోల్‌కతాలో (Kolkata) 13 ఏండ్ల‌ బాలికను ముద్దు పెట్టుకున్న ఆమె స్నేహితుణ్ని, అతని తండ్రిని, మిత్రుణ్ని నగ్నంగా నడిపించిన ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించిన విష‌యం తెలిసిందే. వారిపై దాడికి పాల్ప‌డిన‌ నిందుతుల‌ను కూడా అదే ప్రాంతంలో పోలీసులు అర్ధ‌న‌గ్నంగా న‌డిపించారు.

G

National | Published On Oct 28, 2026, 8.23 am IST

Kolkata | బాలిక‌కు ముద్దు పెట్టాడ‌ని తండ్రీకొడుకులను న‌గ్నంగా న‌డిపించారు.. నిందితుల‌ను కూడా..
Advertisement

Kolkata | త్రినేత్ర న్యూస్‌: ప‌శ్చిమ బెంగాల్‌లోని దక్షిణ కోల్‌కతాలో (Kolkata) 13 ఏండ్ల‌ బాలికను ముద్దు పెట్టుకున్న ఆమె స్నేహితుణ్ని, అతని తండ్రిని, మిత్రుణ్ని నగ్నంగా నడిపించిన ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించిన విష‌యం తెలిసిందే. వారిపై దాడికి పాల్ప‌డిన‌ నిందుతుల‌ను కూడా అదే ప్రాంతంలో పోలీసులు అర్ధ‌న‌గ్నంగా న‌డిపించారు. ఆదివారం (అక్టోబ‌ర్ 25) సాయంత్రం సర్సూనా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఖుదీరాం పల్లి (Khudiram Palli), బసుంధర పార్కులో 17 సంవత్సరాల బాలుడు తన 13 ఏండ్ల‌ స్నేహితురాలితో (Girlfriend) కలిసి మాట్లాడుతూ ముద్దు (Kiss) పెట్టుకున్నాడు. దానిని గమనించిన బాలిక మేనమామ ఆమె తల్లిదండ్రులు, ఇతర మిత్రులకు చెప్పాడు. దీంతో వారు యువకుణ్ని అతని మిత్రుణ్ని తమ ఇంటి వద్దకు లాక్కుపోయి తీవ్రంగా కొట్టారు.

అనంతరం బాలుడితో అత‌ని తండ్రికి ఫోన్‌ చేసి పిలిపించారు. కుమారుడి ఫోన్‌ కాల్‌తో అక్కడికి చేరుకున్న తండ్రి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. అత‌ని చేతిలో తుపాకీ పెట్టిన బాలిక మేనమామ.. నీ కొడుకును కాల్చి చంపు లేదా పూర్తి నగ్నంగా (Walk Naked) అతనితో కలిసి నడువు అన్నాడు. దీంతో కొడుకు, అత‌ని మిత్రునితో క‌లిసి నగ్నంగా నడిచారు. ఈ స‌మ‌యంలో బాలిక త‌ర‌ఫువారు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైర‌ల్ అవ‌డంతో క‌ల‌క‌లం సృష్టించింది.

యువకుని తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హత్యాయత్నంతో సహా బీఎన్‌ఎస్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలిక తల్లిదండ్రులతోపాటు ఆమె అన్న‌య్యాలు, మేనమామను సోమవారం అరెస్టు చేశారు. అనంత‌రం సీన్ రీక‌న్‌స్ట్ర‌క్ష‌న్‌లో భాగంగా ఘ‌ట‌నా స్థ‌లానికి బాలిక తండ్రి, మేన‌మాన‌, అన్న‌య్య‌ల‌ను తీసుకెళ్లిన పోలీసులు.. నిందితులకు షార్ట్స్ (చిన్న నిక్కర్లు) మాత్రమే వేయించి ఆ ప్రాంతమంతా (Parade Naked) నడిపించారు. ఆ ముగ్గురి న‌డుముల‌కు తాళ్లు క‌ట్టి బేహాలాలోని సర్సునా పరిధిలో ఉన్న ఖుదీరామ్ పల్లి ప్రాంతానికి తీసుకువచ్చారు. బాధితులను ఏ వీధుల్లోనైతే నగ్నంగా ఊరేగించారో.. సరిగ్గా అదే పరిసరాల్లో నిందితులను కూడా పోలీసులు నడిపించారు. దీనిపై స్థానికులు స్పందిస్తూ.. బాధితులకు జరిగిన ఘోర అవమానానికి పోలీసుల చర్య తక్షణ న్యాయం లాంటిదని అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement