త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Balmoor Venkat | నీళ్లు, నిధులు, నియామ‌కాలు క‌ల్వ‌కుంట్ల కుటుంబానికే ద‌క్కాయి

MLC Balmoor Venkat | తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. కానీ గ‌త పదేళ్లలో నీళ్లు, నిధులు, నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికే దక్కాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ ఆరోపించారు. కేసీఆర్ ఆ నినాదాన్ని తన కుటుంబం కోసం, స్వార్థం కోసమే వాడుకున్నాడు అని పేర్కొన్నారు.

S

Telangana | Published On Oct 17, 2026, 7.44 pm IST

MLC Balmoor Venkat | నీళ్లు, నిధులు, నియామ‌కాలు క‌ల్వ‌కుంట్ల కుటుంబానికే ద‌క్కాయి
Advertisement

స‌ర్కార్ ఖ‌జానా ఖాళీ.. బీఆర్ఎస్ ఖాతా ఫుల్
ఇది క‌ల్వ‌కుంట్ల కుటుంబం తెచ్చిన క‌రువు
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ వ్యాఖ్య‌

MLC Balmoor Venkat | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. కానీ గ‌త పదేళ్లలో నీళ్లు, నిధులు, నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికే దక్కాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ ఆరోపించారు. కేసీఆర్ ఆ నినాదాన్ని తన కుటుంబం కోసం, స్వార్థం కోసమే వాడుకున్నాడు అని పేర్కొన్నారు.

ఇది కల్వకుంట్ల కుటుంబం తెచ్చిన కరువు. కాసుల కోసం కక్కుర్తిపడి, కట్టాల్సినచోట ప్రాజెక్టులు కట్టలేదు. కాళేశ్వరం నీళ్లను తన ఫామ్ హౌస్‌కు వచ్చేలా చేసుకున్నాడు. నియామకాలు, తన కుటుంబ సభ్యులు, బంధువులకు కట్టబెట్టాడు. ఇక నిధుల మాటకొస్తే, సర్కార్ ఖజానా ఖాళీ అయింది, విరాళాల రూపంలో బీఆర్ఎస్ ఖాతా నిండిది. అంతే కాదు అధికారాన్ని అడ్డుపెట్టుకుని, నిధులు దారి మళ్లించి, దండుకున్నారు, భూములు, వ్యాపారాలు, పెంచుకున్నారే తప్పా, ప్రజల గురించి ఆలోచించిన పాపాన పోలేదు అని ధ్వ‌జ‌మెత్తారు.

ఇలా తెలంగాణ కోసం సబ్బండ వర్గాల ప్రజలు తెగించి కొట్లాడితే... బాగుపడింది మాత్రం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే. ఇప్పుడు ప్రపంచమంతా ఎల్ నినో ప్రభావం ఉంటే, తెలంగాణలోనే ఉన్నట్లు, ప్రభుత్వమే చేసినట్లు బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం వారి అవివేకం. హరీష్ రావు ధర్నా రైతుల కోసం కాదు, వాళ్ల మామ ఫామ్ హౌస్‌కు నీళ్ళు ఇవ్వాలని. గత పదేళ్లు ఎవరు ఏం చేశారో ప్రజలంతా గమనించే, మిమ్మల్ని గడప దాటించారు. సొంత తెలివితేటలు కాకుండా, నిపుణులు సలహాలు తీసుకుని కాళేశ్వరం కట్టి ఉంటే, ఈ కష్టకాలంలో కాళేశ్వరం ఉపయోగపడేది. చేసిన తప్పులన్నీ మీరు చేసి ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరెంత చెప్పిన వాస్తవ పరిస్థితులు ఏంటో ప్రజలందరికీ తెలుసు అని బ‌ల్మూరి వెంక‌ట్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement