Indiramma’s Quotes Book Launch | ‘ఇందిరమ్మ సూక్తులు’ తెలుగు పుస్తకం ఆవిష్కరణ.. ముందుమాట రాసిన సోనియా
Indiramma's Quotes Book Launch | | ‘ఇందిరమ్మ సూక్తులు’ తెలుగు పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆదివారం హైదరాబాద్ (Hyderabad) లోని గాంధీభవన్‌లో ఆవిష్కరించారు.
Indiramma's Quotes Book Launch | త్రినేత్ర న్యూస్: ‘ఇందిరమ్మ సూక్తులు’ తెలుగు పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆదివారం హైదరాబాద్ (Hyderabad) లోని గాంధీభవన్‌లో ఆవిష్కరించారు. సోనియా గాంధీ ముందుమాట రాసిన ఈ పుస్తకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలుగులో ప్రచురింపజేశారు. ఇందిరా గాంధీ ఆలోచనలు, ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తిని భావితరాలకు పరిచయం చేసే దిశగా ఈ పుస్తకం ఒక మంచి ప్రయత్నంగా నిలవనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా యువతకు దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆలోచనలు, సందేశాలు, సూక్తులను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తెలుగులో ప్రచురించినట్లు పొన్నం తెలిపారు.
ఇంగ్లిష్ లో వచ్చిన ఇందిరా గాంధీ సెలెక్టెడ్ సేయింగ్స్‌ను తెలుగులో ఇందిరమ్మ సూక్తులు పేరుతో డా.పొన్నం రవిచంద్ర, డా.మామిడి హరికృష్ణ, శ్రీలక్ష్మి అనువదించగా మంత్రి పొన్నం వెలువరించారు. తొలుత ఈ పుస్తకాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కన్నడ భాషలో వెలువరించారు. కాగా ఈ పుస్తకానికి సోనియా రాసిన ముందుమాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బి.ఎం. సందీప్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీఏసీ సభ్యులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | నన్నే కమాండ్ చేస్తరా? కలిసుందామా? కొట్టుకుందామా?
నవంబర్ 22, 2026

Literary Discussion Conference | ఆ కవులవే సకల జన కలాలు.. అందుకే తెలుగు సాహిత్యం పరిపుష్టమైంది: జూలూరు గౌరీ శంకర్
నవంబర్ 22, 2026

Prabhas | డ్రగ్స్ రహిత భారత్ కోసం ప్రభాస్.. ‘నషా ముక్త్ భారత్’ ఉద్యమానికి మద్దతు కోరిన కిషన్రెడ్డి
నవంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Sudhakar Son | హీరోగా మారిన కమెడియన్ సుధాకర్ కొడుకు - ఒకే రోజు రెండు సినిమాలతో బాక్సాఫీస్ బరిలో...
- ●Literary Discussion Conference | ఆ కవులవే సకల జన కలాలు.. అందుకే తెలుగు సాహిత్యం పరిపుష్టమైంది: జూలూరు గౌరీ శంకర్
- ●Biotechnology | అంతరిక్షంలో ఔషధాల తయారీకి భారత్ సన్నాహాలు!
- ●Balen Shah India Visit | సరిహద్దు వివాదం తర్వాత తొలిసారి ఢిల్లీకి నేపాల్ ప్రధాని
- ●Prabhas | డ్రగ్స్ రహిత భారత్ కోసం ప్రభాస్.. ‘నషా ముక్త్ భారత్’ ఉద్యమానికి మద్దతు కోరిన కిషన్రెడ్డి
- ●Leopard | వికారాబాద్ జిల్లాలో చిరుత కలకలం.. రైతుపై దాడికి యత్నం

Sudhakar Son | హీరోగా మారిన కమెడియన్ సుధాకర్ కొడుకు - ఒకే రోజు రెండు సినిమాలతో బాక్సాఫీస్ బరిలో...

Literary Discussion Conference | ఆ కవులవే సకల జన కలాలు.. అందుకే తెలుగు సాహిత్యం పరిపుష్టమైంది: జూలూరు గౌరీ శంకర్

Biotechnology | అంతరిక్షంలో ఔషధాల తయారీకి భారత్ సన్నాహాలు!

Balen Shah India Visit | సరిహద్దు వివాదం తర్వాత తొలిసారి ఢిల్లీకి నేపాల్ ప్రధాని



