త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

New PACS | రాష్ట్రంలో 240 కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటు.. గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప్రభుత్వం

New PACS | తెలంగాణ రాష్ట్రంలో సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం (TG Govt) కీలక నిర్ణయం తీసుకుంది. 240 కొత్త ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ స‌హ‌కార సంఘాల (PACS) ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

S

Telangana | Published On Nov 18, 2026, 12.13 pm IST

New PACS | రాష్ట్రంలో 240 కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటు.. గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప్రభుత్వం
Advertisement
  • వికారాబాద్‌కు 15 స‌హ‌కార సంఘాలు
  • మరింత చేరువ‌గా పంట రుణాలు, ఎరువులు, విత్తనాల సరఫరా, ధాన్యం కొనుగోలు సేవలు

New PACS | త్రినేత్ర న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం (TG Govt) కీలక నిర్ణయం తీసుకుంది. 240 కొత్త ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ స‌హ‌కార సంఘాల (New PACS) ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో పాటు ఇప్పటికే ఉన్న సంఘాల పునర్వ్యవస్థీకరణ (Reorganisation of associations)కు తదుపరి చర్యలు చేపట్టేందుకు వ్యవసాయ, సహకార శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో 15 కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఈనెల 11నే ప్రభుత్వ మెమో జారీ కాగా నిబంధనల ప్రకారం అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసి తదుపరి చర్యలు చేపట్టాలని ప్ర‌భుత్వం అధికారులను ఆదేశించింది.

ఆ మూడు మండలాలకు తొలిసారి..

ప్రస్తుతం ఉన్న సహకార సంఘాల పరిధులను విభజించి కొత్త సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని వట్టిమీనపల్లి, పూడూరు, ఎల్మకన్న, నవాంద్గి, యాలాల్, హుస్నాబాద్, దౌల్తాబాద్, శివారెడ్డిపేట్, ధారూర్, మర్పల్లి, మోమిన్‌పేట్, మెట్లకుంట, కులకచర్ల, బంట్వారం సొసైటీల పరిధుల్లో కొత్త సంఘాలు ఏర్పాటు కానున్నాయి. వట్టిమీనపల్లి పరిధిలో చించల్‌పేట్, ఎల్లకొండ, పూడూరు పరిధిలో అంగడిచిట్టెంపల్లి, ఎల్మకన్న పరిధిలో గౌతాపూర్, నవాంద్గి పరిధిలో ఖాసింపూర్, యాలాల్ పరిధిలో లక్ష్మీనారాయణపూర్, హుస్నాబాద్ పరిధిలో రుద్రారం, దౌల్తాబాద్ పరిధిలో గోకఫసల్వాద్, శివారెడ్డిపేట్ పరిధిలో అత్వెల్లి, ధారూర్ పరిధిలో నాగారం, మర్పల్లి పరిధిలో పట్లూర్, మోమిన్‌పేట్ పరిధిలో వెంకటాల కొత్త సొసైటీలుగా ఏర్పడనున్నాయి. మెట్లకుంట పరిధిలో దుద్యాల్, కులకచర్ల పరిధిలో చౌడాపూర్, బంట్వారం పరిధిలో కోట్‌పల్లి సొసైటీల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇప్పటివరకు పీఏసీఎస్‌లు లేని ఈ మూడు మండలాలకు కొత్త సంఘాలు అందుబాటులోకి రానున్నాయి.

కొత్త సొసైటీల ఏర్పాటు పూర్తయితే ఆయా ప్రాంతాల రైతులకు క్షేత్ర‌స్థాయిలో పంట రుణాలు, ఎరువులు, విత్తనాల సరఫరా, ధాన్యం కొనుగోలు వంటి సేవలు మరింత చేరువ కానున్నాయి.

Advertisement
Advertisement