Vikarabad | అండర్-19 జట్టుకు ఎంపికైనా.. అంతలోనే విషాదం!
Vikarabad | క్రికెట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న కల.. ప్రతిభతో బీసీసీఐ అండర్-19 జట్టులో చోటు.. అంతలోనే ఊహించని విషాదం. ఆకతాయిల వేధింపుల కారణంగా వికారాబాద్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల యువ క్రికెటర్ నందిని ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.
- యువ క్రికెటర్ నందిని ఆత్మహత్య.. వికారాబాద్‌లో విషాదం..
- ప్రేమ పేరుతో వేధించారంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ
Vikarabad | క్రికెట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న కల.. ప్రతిభతో బీసీసీఐ అండర్-19 జట్టులో చోటు.. అంతలోనే ఊహించని విషాదం. ఆకతాయిల వేధింపుల కారణంగా వికారాబాద్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల యువ క్రికెటర్ నందిని ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. యాలాల మండలం సంగయ్యపల్లికి చెందిన నందిని వికారాబాద్ పట్టణంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ క్రికెట్‌లో శిక్షణ పొందుతోంది. ఆటలో తన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇటీవలే బీసీసీఐ అండర్-19 జట్టుకు ఎంపికైంది. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
వేధింపులే కారణమంటూ కుటుంబం ఆరోపణ
ఇద్దరు విద్యార్థుల వేధింపులే నందిని మృతికి కారణమని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రేమ పేరుతో ఓ యువకుడు కొంతకాలంగా నందినిని మానసికంగా వేధిస్తున్నాడని, మరో విద్యార్థి కృష్ణ అతడికి సహకరిస్తూ ఇబ్బందులకు గురిచేశాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేధింపుల కారణంగానే తమ కుమార్తె తీవ్ర మనస్తాపానికి గురైందని కన్నీరుమున్నీరవుతున్నారు. క్రికెట్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన యువ క్రీడాకారిణి అర్ధంతరంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు. వేధింపులపై కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఘటనకు గల పూర్తి కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
సంబంధిత వార్తలు

Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!
నవంబర్ 15, 2026

Karthika Brahmotsavam | అరుణాచల క్షేత్రానికి కార్తీక శోభ.. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
నవంబర్ 15, 2026

Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం
- ●Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!
- ●Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం
- ●Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!
- ●Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్
- ●Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!

DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం

Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!

Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం

Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!



