Literary Discussion Conference | ఆ కవులవే సకల జన కలాలు.. అందుకే తెలుగు సాహిత్యం పరిపుష్టమైంది: జూలూరు గౌరీ శంకర్
Literary Discussion Conference | | వెనుకబడిన కులాలకు చెందిన కవులు, రచయితలే సకల జనుల కోసం కలాలను కదిలించారని.. అందుకే తెలుగు సాహిత్యం (Telugu Literature) పరిపుష్టమైందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ (Juluru Gouri Shankar) కొనియాడారు.
Literary Discussion Conference | త్రినేత్ర న్యూస్: వెనుకబడిన కులాలకు చెందిన కవులు, రచయితలే సకల జనుల కోసం కలాలను కదిలించారని.. అందుకే తెలుగు సాహిత్యం (Telugu Literature) పరిపుష్టమైందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ (Juluru Gouri Shankar) కొనియాడారు. పై వర్గాలకు చెందిన కవులు, రచయితలు తమ కోసం తాము రాసుకున్నారన్నారు. వెనుకబడ్డ కులాలు, జాతులు అన్ని రంగాల్లో అణిచి వేయబడుతున్నట్లుగానే సాహిత్య సాంస్కృతిక రంగాల్లో కూడా విస్మరణకు గురవుతూ వస్తున్నారని వివరించారు. ప్రముఖ కవి, గాయకుడు, తాత్వికుడు అంబటి వెంకన్న 30 ఏళ్ల సాహిత్య ప్రయాణంపై ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన సాహిత్య సమాలోచన సదస్సు(Literary Discussion Conference)లో ఆయన ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణలో సాహిత్య సాంస్కృతిక రంగాలు అత్యంత గొప్ప పాత్రను పోషించాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 500 మంది కళాకారులకు ఉద్యోగ భృతిని కల్పిస్తూ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లు, అన్ని రంగాలలో బీసీ హక్కుల కోసం రగులుతున్న ఉద్యమాలకు మద్దతుగా అంబటి సాహిత్య సృష్టి చేశారని చెప్పారు.
ప్రఖ్యాత దర్శకుడు బి.నర్సింగరావు మాట్లాడుతూ.. 50 ఏళ్ల క్రితం ఆర్ట్స్ లవర్స్ ఏర్పాటుతో గద్దర్ లాంటి మహా కవులు, కళాకారుల ప్రవేశంతో పాట ఎంతో పరిణితి చెందిందో వివరించారు. తెలంగాణలో ఎగుస్తున్న అన్ని ఉద్యమాల్లో అంబటి వెంకన్న పాట, మాట, ఆట ఉందన్నారు.
సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సంపాదకులు డాక్టర్ కే శ్రీనివాస్ ప్రసంగిస్తూ.. తెలంగాణలో ఎగిసిన అన్ని ప్రజాస్వామ్య ఉద్యమాలకు అంబటి వెంకన్న తన గొంతు నిచ్చారని చెప్పారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో వెంకన్న పాత్ర కీలకమైందన్నారు.
ప్రముఖ సాహిత్య విమర్శకులు సంగీశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీసీ సాహిత్య ఉద్యమంలో అంబటి వెంకన్న మైలురాయిగా నిలుస్తారన్నారు. వెనుకబడ్డ కులాల గొంతుకలే నేడు తెలుగు సాహిత్యంలో సమర శంఖం పూరిస్తున్నాయని విశ్లేషించారు.
ఈ ప్రారంభ సభకు ప్రముఖ కథా రచయిత శీలం భద్రయ్య అధ్యక్షత వహించగా విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు పి.కరెంట్ రావ్, రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో మాజీ అధికారి మునాసు వెంకటేశం, చెన్నైకి చెందిన సామాజిక కార్యకర్త ఆర్కే వెంకట్, నల్లగొండ కవి బండారు శంకర్ తదితరులు మాట్లాడారు.
ఈ సందర్భంగా అంబటి వెంకన్న మాతృమూర్తిని అతిథులు ఘనంగా సత్కరించారు. అంబటి వెంకన్న సాహిత్యంపై నాలుగు సెషన్లు నిర్వహించారు. ఇందులో ప్రముఖ కవి నాళేశ్వరం శంకరం, ప్రముఖ రచయిత్రి దాసోజు లలిత, ప్రఖ్యాత కవయిత్రి జి.విజయలక్ష్మి, జానపద గాయని స్వప్న, మన ఆలోచన సాధన సమితి అధ్యక్షులు కటకం నర్సింగరావు పలు రంగాలకు చెందిన కవులు, రచయితలు, కళాకారులు ప్రసంగించారు.
అంతకుముందు ఈ సదస్సును ప్రముఖ దర్శకుడు, నిర్మాత డాక్టర్ బి.నర్సింగరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా "అంబటి ఎట్ ద రేట్ ఆఫ్ 30" అంబటి వెంకన్న సాహితీయానం పుస్తకాన్ని బీ నర్సింగరావు ఆవిష్కరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Maruti Suzuki | మారుతి కార్ల ధరలకు మరోసారి రెక్కలు.. నేటి నుంచే కొత్త రేట్లు!
- ●CM Revanth Reddy | నన్నే కమాండ్ చేస్తరా? కలిసుందామా? కొట్టుకుందామా?
- ●Sudhakar Son | హీరోగా మారిన కమెడియన్ సుధాకర్ కొడుకు - ఒకే రోజు రెండు సినిమాలతో బాక్సాఫీస్ బరిలో...
- ●Biotechnology | అంతరిక్షంలో ఔషధాల తయారీకి భారత్ సన్నాహాలు!
- ●Balen Shah India Visit | సరిహద్దు వివాదం తర్వాత తొలిసారి ఢిల్లీకి నేపాల్ ప్రధాని
- ●Prabhas | డ్రగ్స్ రహిత భారత్ కోసం ప్రభాస్.. ‘నషా ముక్త్ భారత్’ ఉద్యమానికి మద్దతు కోరిన కిషన్రెడ్డి

Maruti Suzuki | మారుతి కార్ల ధరలకు మరోసారి రెక్కలు.. నేటి నుంచే కొత్త రేట్లు!

CM Revanth Reddy | నన్నే కమాండ్ చేస్తరా? కలిసుందామా? కొట్టుకుందామా?

Sudhakar Son | హీరోగా మారిన కమెడియన్ సుధాకర్ కొడుకు - ఒకే రోజు రెండు సినిమాలతో బాక్సాఫీస్ బరిలో...

Biotechnology | అంతరిక్షంలో ఔషధాల తయారీకి భారత్ సన్నాహాలు!





