త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asha Bhosle | ఆశా భోస్లే ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం..!

Asha Bhosle | ప్రముఖ గాయ‌ని ఆశా భోస్లే ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. గుండెపోటు, ఊపిరితిత్తుల సంబంధిత స‌మ‌స్య‌ల‌తో ముంబైలోని బ్రీచ్ క్యాండి ఆస్ప‌త్రిలో శ‌నివారం రాత్రి చేరారు. ప్ర‌స్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

S

Telangana | Published On Apr 12, 2026, 11.03 am IST

Asha Bhosle | ఆశా భోస్లే ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం..!
Advertisement

Asha Bhosle | త్రినేత్ర‌.న్యూస్ : ప్రముఖ గాయ‌ని ఆశా భోస్లే ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. గుండెపోటు, ఊపిరితిత్తుల సంబంధిత స‌మ‌స్య‌ల‌తో ముంబైలోని బ్రీచ్ క్యాండి ఆస్ప‌త్రిలో శ‌నివారం రాత్రి చేరారు. ప్ర‌స్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. భోస్లే ఆరోగ్య ప‌రిస్థితి విషమంగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఆరోగ్య ప‌రిస్థితిపై కుటుంబ స‌భ్యులు ఇప్పటి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌లేదు.

ఆశా భోస్లే మ‌నుమ‌రాలు జ‌నై త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా భోస్లే ఆరోగ్య వివ‌రాల‌ను పంచుకున్నారు. అమ్మ‌మ్మ ఆశా భోస్లే.. ఛాతీలో నొప్పి కార‌ణ‌గా ఆస్ప‌త్రిలో చేరిన‌ట్లు పేర్కొన్నారు. చికిత్స కొన‌సాగుతోంది. అంతా మంచే జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నాం. త్వ‌ర‌లోనే ఆమె ఆరోగ్య ప‌రిస్థితి గురించి సానుకూల స‌మాచారాన్ని తెలియ‌జేస్తామ‌న్నారు. త‌మ వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు విలువ ఇవ్వాల‌ని జ‌నై కోరారు.

దివంగ‌త లెజెండ‌రీ సింగ‌ర్ ల‌తా మంగేష్క‌ర్ చెల్లెలే ఆశా భోస్లే. ఈమె 12,500ల‌కు పైగా పాట‌లు పాడి.. కోట్లాది సంగీత ప్రియుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ఇక 2023లో త‌న 90వ పుట్టిన రోజు వేడుక‌ల‌ను దుబాయ్‌లో జ‌రుపుకున్నారు. అక్క‌డ ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక సంగీత క‌చేరీలో ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు ఆశా భోస్లే.

సంగీత రంగంలో ఆమె చేసిన కృషికి గానూ 2000లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు అందుకున్నారు. వీటితో పాటు ఉమ్రావ్ జాన్, ఇజాజ‌త్ చిత్రాల‌లో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌కు గానూ రెండు జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల‌ను పొందారు.

 

Advertisement
Advertisement