RS Praveen Kumar | తెలంగాణల భూమి చోరీ జరుగుతోంది
RS Praveen Kumar | ఓటు చోరీ జరుగుతుందని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలో ఫ్లెక్సీలు పెట్టారని.. తెలంగాణలో భూమి చోరీ కనిపించడం లేదా అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు.
- చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి భూదందాలు చేస్తున్నారు
- చామల బినామీలు రాయదుర్గంలో విల్లాలు కడుతున్నారు
- బీఆర్ఎస్ నేతలకు సంబంధం లేని వ్యక్తుల భూములను 134 కింద పెట్టారు
- మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
RS Praveen Kumar | త్రినేత్ర న్యూస్: ఓటు చోరీ జరుగుతుందని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలో ఫ్లెక్సీలు పెట్టారని.. తెలంగాణలో భూమి చోరీ కనిపించడం లేదా అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో 134 రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఇబ్రహీంపట్నంలో మల్ రెడ్డి రంగారెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి భూదందా చేస్తున్నారని ఆరోపించారు. సీఎస్ సంజయ్ జాజు చట్ట ప్రకారం పని చేయాలని సూచించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రతీకార పాలన నడుస్తోంది
రాష్ట్రంలో ప్రతీకార పాలన నడుస్తోంది. రైతులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎల్ నినోపై ప్రభుత్వం సన్నద్ధం కాలేదు. రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ లో సిద్ధహస్తుడు. జీవో నంబర్ 134లో తప్పిదాలు చోటుచేసుకున్నాయి. 16 భూములపై విచారణ జరపాలని ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. జీవోలో బీఆర్ఎస్ నాయకుల భూములను పెట్టారు. ఎన్నికల అఫిడవిట్ లో పెట్టిన భూములు, రాజకీయాల్లోకి రాక ముందు ఉన్న భూములను సైతం జీవో 134 కింద పెట్టారు. బీఆర్ఎస్ నేతలకు సంబంధం లేని వ్యక్తుల భూములను జీవో నంబర్ 134లో పెట్టారు. నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు సికింద్రాబాద్‌లో ఉన్న భూములను 134 కిందే పెట్టారు.
స్టీఫెన్ సన్ కు 50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి దొరికారు. అందులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాయిస్ ఉంది. ఈ కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు అయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం. జీవో నంబర్ 134పై చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుకు లెటర్ రాశాను. 22ఏ పై అసెంబ్లీలో జరిగిన చర్చ ఏకపక్షంగా ఉంది. కాంగ్రెస్ నేతలు మల్ రెడ్డి రంగారెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీర్ల అయిలయ్య భూముల వివరాలను ఎపిసోడ్ కింద బయటపెడతాం. రేవంత్ రెడ్డికి, కుటుంబ సభ్యులకు, ఆయన కుమార్తె నైమిషా రెడ్డికి 80 కోట్లు విలువ చేసే భూమిని 10 కోట్లకు కొనుక్కున్నారు. సీఎం కుటుంబం స్టాంప్ డ్యూటీ ఎగ్గొడితే ఎలా?
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వట్టి నాగులపల్లిలో 27 ఎకరాల భూమి ఉంది. నానక్ రామ్ గూడ, పుప్పాల గూడలో పొంగులేటి కుటుంబ సభ్యులకు భూములు ఉన్నాయి. ఖాజాగూడలో 3 ఎకరాల భూమిని అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఖానామెట్ లో 26 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వం ఏ జీవో, చట్టం తెచ్చినా రాజ్యంగ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. మా భూములపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హరీష్ రావు చెప్పారు. సీఎస్ సంజయ్ జాజు చట్ట ప్రకారం పని చేయాలి.
రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అభ్యంతరాలు ఉంటే నోట్ ఫైల్ చేయాలి. చామల కిరణ్ కుమార్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వెళ్లి బీఆర్ఎస్ నేతల భూములను చూశారు. ఇబ్రహీంపట్నంలో మల్ రెడ్డి రంగారెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి భూదందా చేస్తున్నారు. మొత్తం 2,600 ఎకరాల్లో కాంగ్రెస్ నేతలు భూ దందా చేస్తున్నారు. ఫెక్ ఎఫ్.ఐ.ఆర్ సృష్టించి ఘోరమైన కుంభకోణం చేస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో ఎమ్మార్వోగా రెండు ఏళ్ళు ఉన్న సుదర్శన్ రెడ్డిని ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు. ఎకరాకు 10 నుంచి 15 లక్షల లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సుదర్శన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోవాలి.
గోపాల్ యాదవ్ అసైన్డ్ భూములను పట్టాలు చేయించుకున్నారు
మునగనూరుకు చెందిన గోపాల్ యాదవ్ చామల కిరణ్ కుమార్ రెడ్డి అండతో అసైన్డ్ భూములను పట్టాలు చేయించుకున్నారు. రాయదుర్గంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి బినామీలు విల్లాలు కడుతున్నారు. మేం కాంగ్రెస్ వాళ్ళ లాగా కక్ష సాధింపు రాజకీయాలు చేయం. కాంగ్రెస్ వాళ్లు చావు డప్పు కొట్టారని మేం ఆ పని చేయం. బీఆర్ఎస్ పై కక్ష ఉన్న ఐఏఎస్ అధికారులను జీవో నంబర్ 134 కమిటీలో పెట్టారు. సందీప్ ఝా అనే ఐఏఎస్ ను కమిటీలో పెట్టారు. రేవంత్ రెడ్డి గోవాలో భూ కుంభకోణం గురించి మాట్లాడటం అంటే చార్లెస్ శోభ రాజ్ కథలా ఉంటుంది అని ప్రవీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు.
ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు అభిలాష్ రంగినేని, తొట్ల స్వామి యాదవ్, కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్ పి.రాజ్ కుమార్, వి. రాజు, రాజేష్ పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nandan Nilekani NEET Paper Leak Reforms | పరీక్ష రోజే చివరి నిమిషంలో క్వశ్చన్ పేపర్.. AIతో లీకేజీలకు ఫుల్స్టాప్
- ●Piyush Goyal | కాంగ్రెస్‌కు రాహుల్ గాంధీయే అతిపెద్ద ‘రెడ్ ఫ్లాగ్’
- ●Dussehra Gift for FTE Employees | ఉపాధి హామీ పథకం ఎఫ్‌టీఈ ఉద్యోగులకు దసరా కానుక: మంత్రి సీతక్క
- ●Tripti Dimri | బోల్డ్ బయోపిక్‌లో త్రిప్తి డిమ్రి
- ●Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 1,109 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
- ●Amit Shah BIMSTEC Meeting | ఏ దేశంపైనా దాడి చేయడం మా సిద్ధాంతం కాదు

Nandan Nilekani NEET Paper Leak Reforms | పరీక్ష రోజే చివరి నిమిషంలో క్వశ్చన్ పేపర్.. AIతో లీకేజీలకు ఫుల్స్టాప్

Piyush Goyal | కాంగ్రెస్‌కు రాహుల్ గాంధీయే అతిపెద్ద ‘రెడ్ ఫ్లాగ్’

Dussehra Gift for FTE Employees | ఉపాధి హామీ పథకం ఎఫ్‌టీఈ ఉద్యోగులకు దసరా కానుక: మంత్రి సీతక్క

Tripti Dimri | బోల్డ్ బయోపిక్‌లో త్రిప్తి డిమ్రి







