Piyush Goyal | కాంగ్రెస్‌కు రాహుల్ గాంధీయే అతిపెద్ద ‘రెడ్ ఫ్లాగ్’
Piyush Goyal | లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, లల్లన్ సింగ్ (రాజీవ్ రంజన్ సింగ్) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీయే అతిపెద్ద ‘రెడ్ ఫ్లాగ్’ అని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికతను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్.. తన గత చరిత్రను, వ్యవహారశైలిని మాత్రం సమీక్షించుకోవడం లేదని మండిపడ్డారు.
- ఓటు చోరీ ఆరోపణలు నిరాధారం..
- ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- కేంద్రమంత్రి పీయుష్ గోయల్
Piyush Goyal | లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, లల్లన్ సింగ్ (రాజీవ్ రంజన్ సింగ్) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీయే అతిపెద్ద ‘రెడ్ ఫ్లాగ్’ అని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికతను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్.. తన గత చరిత్రను, వ్యవహారశైలిని మాత్రం సమీక్షించుకోవడం లేదని మండిపడ్డారు. ఓటు చోరీ పేరుతో నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. న్యూఢిల్లీలో ఇద్దరు కేంద్ర మంత్రులు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ తీరును ఎండగట్టారు.
కాంగ్రెస్ నేతలే ఈసీని ప్రశంసించారు
ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు ఆ పార్టీ నేతల గత వ్యాఖ్యలే విరుద్ధంగా ఉన్నాయని గోయల్ పేర్కొన్నారు. కేరళలో ఎస్‌ఐఆర్ కారణంగా కాంగ్రెస్ విజయం సాధించిందని శశి థరూర్, రమేశ్ చెన్నితల వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు. కేరళ ముఖ్యమంత్రి కూడా ఎస్‌ఐఆర్‌ను ప్రశంసించారని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల నిర్వహణ తీరును కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సైతం అభినందించారని చెప్పారు. అలాంటప్పుడు ఇప్పుడు ఎన్నికల సంఘంపై ఓటు చోరీ ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
పదవులిచ్చింది మీరే..
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో కాంగ్రెస్ గతంలో వ్యవహరించిన తీరును గోయల్ ప్రశ్నించారు. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ నిజాయతీని కాంగ్రెస్ ప్రశంసించేదని, 1999లో ఆయన్ను ఎల్‌కే అడ్వాణీపై పోటీకి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టిందని గుర్తుచేశారు. ఎన్నికల కమిషనర్లకు రాజకీయ పదవులు, ప్రోత్సాహకాలు కల్పించిన చరిత్ర కాంగ్రెస్‌దేనని ఆరోపించారు. 1996 నుంచి 2001 వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన ఎంఎస్ గిల్‌కు 2000లో పద్మవిభూషణ్ పురస్కారం లభించిందని గోయల్ పేర్కొన్నారు. పదవీ విరమణ తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరి, 2004లో రాజ్యసభకు వెళ్లారని, 2008లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారని వివరించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నరు
ఎన్నికల సంఘం పదవిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారనేందుకు ఇవే ఉదాహరణలని విమర్శించారు. కేరళలో ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన టికారామ్ మీనాను ఏడాది తర్వాత కాంగ్రెస్ రాజస్థాన్ మేనిఫెస్టో రూపకల్పన బృందంలో చేర్చారని గోయల్ ఆరోపించారు. అలాగే, కేరళలో ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేసిన రతన్ యు. కేల్కర్‌ను ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తామని ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రకటించడాన్ని ప్రస్తావించారు. ఎన్నికల్లో సహకరిస్తే కీలక పదవులు కట్టబెడతామనే ధోరణికి ఇవి ఉదాహరణలని వ్యాఖ్యానించారు.
కమిషనర్ల ఎంపికలో మార్పులు తెచ్చాం
ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో మోదీ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చిందని గోయల్ తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వమే తనకు నచ్చిన వారిని ప్రధాన ఎన్నికల కమిషనర్లుగా నియమించేదని విమర్శించారు. 2023లో కొత్త చట్టం తీసుకొచ్చి, ఎంపిక కమిటీలో లోక్‌సభ ప్రతిపక్ష నేతకు కూడా స్థానం కల్పించామని చెప్పారు. ఇప్పుడు ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేతతో కూడిన ఎంపిక కమిటీ ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో భాగస్వామిగా ఉంటుందని వివరించారు. రాజ్యాంగ వ్యవస్థలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, వాటి విశ్వసనీయతను దెబ్బతీసేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని గోయల్ ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిజాయతీగా పనిచేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ కల్పించిందని తెలిపారు.
#WATCH | Delhi: Asking 10 questions to Lok Sabha LoP Rahul Gandhi, Union Minister Piyush Goyal says, "I challenge Rahul Gandhi to answer these 10 questions...Several people consider Rahul Gandhi the biggest red flag because of whom the Congress is losing again and again. Youth calls bad omen, a red flag. Rahul Gandhi is the biggest red flag for Congress..."
He also says, "Rahul Gandhi and his colleagues misbehaved with a woman journalist who is 3 months pregnant...She was only covering their protest. I don't think the 140 crore people of the country or any journalist would ever forgive this..."
— ANI (@ANI) October 13, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Dussehra Gift for FTE Employees | ఉపాధి హామీ పథకం ఎఫ్‌టీఈ ఉద్యోగులకు దసరా కానుక: మంత్రి సీతక్క
- ●Tripti Dimri | బోల్డ్ బయోపిక్‌లో త్రిప్తి డిమ్రి
- ●Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 1,109 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
- ●Amit Shah BIMSTEC Meeting | ఏ దేశంపైనా దాడి చేయడం మా సిద్ధాంతం కాదు
- ●Kishan Reddy | భారత్‌లో కాంగ్రెస్ మార్క్ రాజకీయం నడవదు
- ●ICC Women's ODI Rankings | స్మృతి మంధాన టాప్ ప్లేస్ పదిలం..! ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం..

Dussehra Gift for FTE Employees | ఉపాధి హామీ పథకం ఎఫ్‌టీఈ ఉద్యోగులకు దసరా కానుక: మంత్రి సీతక్క

Tripti Dimri | బోల్డ్ బయోపిక్‌లో త్రిప్తి డిమ్రి

Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 1,109 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..

Amit Shah BIMSTEC Meeting | ఏ దేశంపైనా దాడి చేయడం మా సిద్ధాంతం కాదు






