త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dussehra Gift for FTE Employees | ఉపాధి హామీ పథకం ఎఫ్‌టీఈ ఉద్యోగులకు దసరా కానుక: మంత్రి సీతక్క

Dussehra Gift for FTE Employees | ఉపాధి హామీ ప‌థ‌కం ఎఫ్‌టీఈ ఉద్యోగుల‌కు ద‌స‌రా కానుక ఇస్తున్న‌ట్లు మంత్రి సీత‌క్క (Seethakka) తెలిపారు. 3,800 మంది ఉద్యోగులకు గ్రాట్యుటీతో ఆర్థిక భరోసా క‌ల్పించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

S

Telangana | Published On Oct 13, 2026, 4.18 pm IST

Dussehra Gift for FTE Employees | ఉపాధి హామీ పథకం ఎఫ్‌టీఈ ఉద్యోగులకు దసరా కానుక: మంత్రి సీతక్క
Advertisement

Dussehra Gift for FTE Employees | త్రినేత్ర న్యూస్: ఉపాధి హామీ ప‌థ‌కం ఎఫ్‌టీఈ ఉద్యోగుల‌కు ద‌స‌రా కానుక ఇస్తున్న‌ట్లు మంత్రి సీత‌క్క (Seethakka) తెలిపారు. 3,800 మంది ఉద్యోగులకు గ్రాట్యుటీ (Gratuity)తో ఆర్థిక భరోసా క‌ల్పించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. గ్రాట్యుటీ మంజూరు చేస్తూ ప్ర‌జా ప్ర‌భుత్వం జీవో జారీ చేసింద‌న్నారు. 20 ఏళ్ల ఉద్యోగుల పోరాటాన్ని చూసి తానే చొర‌వ తీసుకున్నాన‌ని చెప్పారు. ఈమేర‌కు మంగ‌ళ‌వారం ఆమె మాట్లాడారు. రిటైర్మెంట్ సమయంలో కనీసం రూ.4 లక్షల గ్రాట్యుటీ ల‌భిస్తుంద‌న్నారు.

పదేళ్ల సర్వీసు పూర్తిచేసే ఉద్యోగులకు కనీసం రూ.10 లక్షల వరకు ప్రయోజనం క‌లుగుతుంది. ఉద్యోగుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. ఉద్యోగుల హక్కులు, ఆత్మగౌరవానికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతున్నాం. రిటైర్మెంట్ తర్వాత ఎఫ్‌టీ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడకూడదన్నదే మా సంకల్పం. కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు జీవిత చరమాంకంలో ఆర్థిక భద్రత కల్పించడం మా బాధ్యత అని సీత‌క్క స్ప‌ష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఎఫ్‌టీఈల 20 ఏళ్ల కలను సాకారం చేసిన మంత్రి సీతక్కకు ఉద్యోగుల సంఘం నేత‌లు కృతజ్ఞతలు తెలిపారు. గ్రాట్యుటీ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Advertisement