Heavy Rains | మండపాల్లో వినాయకులు జాగ్రత్త.. ఎందుకంటే..?
Heavy Rains | రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. వీధుల్లో, కాలనీల్లో గణేశ్ మండపాలు కొలువుదీరుతున్నాయి. అయితే ఈ వినాయక చవితికి భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో మండపాల్లోని గణనాథులను వర్షానికి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Heavy Rains | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. వీధుల్లో, కాలనీల్లో గణేశ్ మండపాలు కొలువుదీరుతున్నాయి. అయితే ఈ వినాయక చవితికి భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో మండపాల్లోని గణనాథులను వర్షానికి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతానికి వానలేం లేవు.. ఇక ముందు ఏం వర్షాలు వస్తాయిలే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సెప్టెంబర్ 13 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ హెచ్చరించారు.
బలహీనమైన అల్పపీడనంతో పాటు తూర్పు-పడమర దిశగా విస్తరించి ఒకే చోట స్థిరపడే 'షియర్ జోన్' (shear zone) ప్రభావంతో, సెప్టెంబర్ 13 నుండి 17 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ ప్రభావం నేరుగా తెలంగాణ రాష్ట్రంపైనే పడుతుండడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో రాజధాని హైదరాబాద్ నగరంలో బలమైన ఉరుములు, మెరుపులతో పాటు వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని తెలిపారు. అయితే వాతావరణ పరిస్థితుల్లో మార్పులు ఏర్పడి సెప్టెంబర్ 10 లేదా 11 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని బాలాజీ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Sreeleela | రాధలా ముస్తాబైన శ్రీలీల.. పింక్ లెహంగాలో అదుర్స్!
- ●Neelakurinji Flowers Munnar | 12 ఏళ్ల నిరీక్షణ: మున్నార్‌లో మళ్లీ వికసించిన నీలకురింజి పూలు.. ఇప్పుడే చూడకపోతే మళ్లీ 2038లోనే!
- ●SC, ST Commission | 48 గంటల్లోగా నివేదిక ఇవ్వండి.. డీజీపీకి ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశం
- ●KTR | వలువలు విప్పుతున్నానన్న రేవంత్‌రెడ్డి.. విలువల గురించి మాట్లాడుతున్నడు : కేటీఆర్
- ●DGP CV Anand | 14 నుంచి గణేశ్ ఉత్సవాలు.. అప్రమత్తంగా ఉండాల్సిందే : డీజీపీ సీవీ ఆనంద్
- ●DRDO SHIELD Project | శత్రు డ్రోన్ల పాలిట యమపాశం.. 'షీల్డ్' ప్రాజెక్టుతో డీఆర్డీవో సంచలనం

Sreeleela | రాధలా ముస్తాబైన శ్రీలీల.. పింక్ లెహంగాలో అదుర్స్!

Neelakurinji Flowers Munnar | 12 ఏళ్ల నిరీక్షణ: మున్నార్‌లో మళ్లీ వికసించిన నీలకురింజి పూలు.. ఇప్పుడే చూడకపోతే మళ్లీ 2038లోనే!

SC, ST Commission | 48 గంటల్లోగా నివేదిక ఇవ్వండి.. డీజీపీకి ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశం

KTR | వలువలు విప్పుతున్నానన్న రేవంత్‌రెడ్డి.. విలువల గురించి మాట్లాడుతున్నడు : కేటీఆర్




