త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tirumala | తిరుమల శ్రీవారికి విశేష అభిషేకం.. ఘ‌నంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు

Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం వైభవంగా ఆరంభమయ్యాయి. తొలిరోజు పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.

P

Devotional | Published On Aug 23, 2026, 5.05 pm IST

Tirumala | తిరుమల శ్రీవారికి విశేష అభిషేకం.. ఘ‌నంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు
Advertisement

Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం వైభవంగా ఆరంభమయ్యాయి. తొలిరోజు పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ హోమాలు, ఇతర వైదిక క్రతువులు నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం చేపట్టారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకం చేశారు.

ఈ సందర్భంగా వేదపండితులు పంచసూక్తాలను పఠించారు. అనంతరం పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక నైవేద్య సమర్పణ నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. కార్యక్రమాల్లో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement